రక్షా బంధన్ రోజున ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు (సోమవారం 19.08.2024) నాడు రాత్రి 11.56 నిమిషాలకు ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ దర్శనమివ్వనుంది.
న్యూస్ లైన్ డెస్క్ : రక్షా బంధన్ రోజున ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు (సోమవారం 19.08.2024) నాడు రాత్రి 11.56 నిమిషాలకు ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ దర్శనమివ్వనుంది. నల్లటి ఆకాశంలో నీలిరంగులో కనిపించి చందమామ ఈరోజు అందరినీ ఆకట్టుకోనునాడు.
ఈరోజు ఆకాశంలో చంద్రుడు సాధారణ రోజుల్లో కంటే 30 శాతం కంటే ఎక్కువ ప్రకాశవంతంగా, 14 శాతం పెద్దగా కనిపించనున్నాడు. ఈ ఏడాది కనిపించనున్న నాలుగు సూపర్ మూన్ లలో ఈ బ్లూ మూన్ అతి పెద్దతి. మిగతావి సెప్టెంబర్ 17న, అక్టోబర్ 17, నవంబర్ 15 తేదీల్లో దర్శనమివ్వనున్నాయి. భూమికి చంద్రుడు అతి దగ్గరగా వచ్చినప్పుడు ఈ సూపర్ మూన్లు ఏర్పడుతాయి.