Narasimha: విద్యుత్ కమిషన్ మీద వేసిన పిటిషన్ లో గెలిచిన కేసీఆర్

తెలంగాణ - ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలు విషయంలో గోల్ మాల్ జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్ కి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. కమిషన్ ఛైర్మన్ రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ నరసింహా రెడ్డి వైఖరిపై మండిపడింది. దీంతో.. ఆయన కమిషన్ నుంచి తప్పుకున్నారు.


Published Jul 16, 2024 07:53:55 AM
postImages/2024-07-16//1721123954_lnnar.PNG

న్యూస్ లైన్ డెస్క్: విద్యుత్ కొనుగోలు అంశం విచారణ కమిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విచారణ కమిషన్ చైర్మన్‌ను మార్చాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్ర‌చూడ్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ విచార‌ణ చేప‌ట్టారు. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కమిషన్ చైర్మన్, మాజీ న్యాయమూర్తి అలా ప్రెస్‌మీట్‌ పెట్టి అభిప్రాయాలు వ్య‌క్త‌ప‌ర‌చ‌డం స‌రికాద‌ని చీఫ్ జస్టిస్ మండిపడ్డారు. వెంటనే విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని ఆదేశించారు. నూతన జడ్జి, కమిషన్ కాల పరిమితి, విధివిధానాలు నోటిఫికేషన్‌లో వెల్లడించాలని సుప్రీంకోర్టు తెలిపింది. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు విద్యుత్ కొనుగోళ్ల కమిషన్ నుంచి తప్పుకుంటున్నట్టు రిటైర్డ్ జస్టిస్ నరసింహ రెడ్డి లేఖ రాశారు. తన రాజీనామాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు వివరిస్తూ విద్యుత్ కమిషన్‌గా తాను కొనసాగనని ప్రకటన చేశారు. ప్రెస్, మీడియా వాళ్లకు తోచినట్టు రాస్తుందని, వివరాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే తాను ప్రెస్ మీట్ పెట్టినట్టు వెల్లడించారు. కమిషన్ కోసం అవసరం అయితే ప్రజల నుంచి బహిరంగంగా కూడా విచారణ జరపాల్సి ఉంటుంది. న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి తాను కమిషన్ నుంచి వైదొలగుతున్నట్టు జస్టిస్ నరసింహ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

newsline-whatsapp-channel
Tags : kcr telangana revanth-reddy supremecourt brs power-cuts

Related Articles