ట్యూషన్లు చెబుతూ చదువుకుని భూక్యా మౌనిక ఎక్కంగా నాగులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది.
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగానికి చాలా డిమాండ్ ఉంది. కాగా, ఈ పోటీ ప్రపంచంలో తమ కలల కొలువు సాధన కోసం అనునిత్యం అలుపెరుగక శ్రమిస్తారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి చదువుతుంటారు. అయితే ఉద్యోగ వేటలో అందరూ విజయం సాధించలేకపోవచ్చు. యువత ఒకటికి రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే కాని ప్రభుత్వ ఉద్యోగం రాని పరిస్థితి ఉంది. అయితే సూర్యాపేట జిల్లా పాతదొనబండ తండాకు చెందిన భూక్యా మౌనిక సత్తా చాటింది. ట్యూషన్లు చెబుతూ చదువుకుని భూక్యా మౌనిక ఎక్కంగా నాగులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది.
పేదరికం వెంటాడుతున్నా ఆ యువతి వెనకడుగు వేయలేదు. ప్రభుత్వ స్కూల్‌లో చదివి స్కాలర్‌షిప్‌లతో ఉన్నత విద్య పూర్తి చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో హోం ట్యూషన్స్ చెబుతూ కోచింగ్ తీసుకోకుండానే నాగులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. రైల్వేలో క్యారేజ్& వ్యాగన్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, గ్రూప్-4 ఆరో ర్యాంక్, పంచాయతీరాజ్ శాఖలో ఏఈఈగా ఈమె ఎంపికయ్యారు. దీంతో గ్రామస్తులు విద్యార్థినికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.