రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. ఈ వర్షాకాలంలో విష జ్వరాలతో ప్రజలు చాలా మంది ఆస్పత్రి పాలవుతున్నారు. ఇప్పటికే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యూ సహా వైరల్ ఫీవర్లతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక బుధవారం రాష్ట్రంలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. చాలా ఏళ్ల తర్వాత రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసులు బయటపడుతున్నాయి. హైదరాబాద్ నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నాలుగు కేసుల్ని నిర్ధారించింది.
మాదాపూర్లో ఉంటున్న పశ్చిమబెంగాల్‌కి చెందిన వ్యక్తికి, టోలీచౌకీకి చెందిన మరో వృద్ధుడికి, హైదరాబాద్‌కు చెందిన మహిళకు, జార్ఖండ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళకు, నిజామాబాద్ జిల్లా పిట్లం మండలానికి చెందిన వ్యక్తికి స్వైన్ ఫ్లూ సోకినట్లు తేల్చింది ఐపీఎం పేర్కొంది. జ్వరం, దగ్గు, గొంతులో మంట, ఒళ్లునొప్పులు, తలనొప్పి, వాంతులులాంటి లక్షణాలుంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలని కోరుతున్నారు.