రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ట్రాఫిక్ పోలీస్ సీఐ వెంకటేశం వాహనదారులపై రెచ్చిపోయాడు.
న్యూస్ లైన్ డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ట్రాఫిక్ పోలీస్ సీఐ వెంకటేశం వాహనదారులపై రెచ్చిపోయాడు. కాలితో తన్నుతూ.. బూతులు తిడుతూ అత్యుత్సాహం చూపించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చేవెళ్ల మండల కేంద్రంలోని గవర్నమెంట్ కాలేజ్ దగ్గర లో శంకర్ పల్లికి వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు డ్రింక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ లో భాగంగా చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం, కానిస్టేబుల్ శ్రీను, హోంగార్డ్ కేశవ్ లు ముగ్గురు కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించే క్రమంలో బైక్ పై వెళుతున్న వ్యక్తులను దుర్భాషలతో తెలుపుతూ వారిని కొట్టడం జరిగింది.
డ్రింక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాళ్లను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తప్ప కొడుతూ తన్నుతూ, దుర్భాషలాడుతూ ప్రజలపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏంటని స్థానికులలో చర్చనీయంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనిపై అధికారులు స్పందించి చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం, కానిస్టేబుల్ శ్రీను, హోమ్ గార్డ్ కేశవ్ ల పైన అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.