కానీ, ఆరతి (మాళవిక మోహనన్) ఆ బంగారానికి కాపలా కాస్తుంది. అయితే, ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ వస్తుంది. తంగలాన్‌కు ఆరతికి మధ్య సంబంధం ఉంటుంది. అసలు ఈ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి అనేదానిపై తరువాతి కథ సాగుతుంది.
న్యూస్ లైన్ డెస్క్: చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం తంగలాన్. రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి, డేనియల్ కల్టగిరోన్ కీలక పాత్రల్లో కనిపించారు. అయితే, పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందన్న ప్రశ్నకు మిక్సిడ్ టాక్ తెచుకుంది. ఇందులో తంగలాన్ (విక్రమ్) తన భార్య గంగమ్మ (పార్వతీ తిరువోతు) బ్రిటీష్ పాలకుల కారణంగా భూమిని కోల్పోతారు. అనుకోని పరిస్థితుల్లో వాళ్లకి బానిసలుగా మారాల్సిన పరిస్థితి వస్తుంది.
ఎలాగైనా ఆ బానిసత్వం నుండి బయటపడాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలోనే తంగలాన్‌కు బంగారు నిధుల గురించి తెలుస్తుంది. ఆ బంగారాన్ని సొంతం చేసుకొని కుటుంబంతో హ్యాపీగా ఉండాలని అనుకుంటాడు. కానీ, ఆరతి (మాళవిక మోహనన్) ఆ బంగారానికి కాపలా కాస్తుంది. అయితే, ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ వస్తుంది. తంగలాన్‌కు ఆరతికి మధ్య సంబంధం ఉంటుంది. అసలు ఈ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి అనేదానిపై తరువాతి కథ సాగుతుంది.
స్టోరీ ఏమైనప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా ల్యాగ్ ఉంది అనే టాక్ వినిపిస్తోంది. కథలోని కొన్ని సన్నివేశాలు ఇంట్రస్టింగ్ గా చూపించినా.. రొటీన్ స్టయిల్ కనిపించినట్లు ఉంది. ఇక క్లైమాక్స్ దగ్గర పడుతుండగా వచ్చే సీన్ లు కూడా ఇంకాస్త బాగా చూపిస్తే బాగుంటుంది అనిపించింది. కొందరు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేసినా.. మరికొందరు మాత్రం సంతృప్తి చెందడం కష్టమే అనిపిస్తోంది. ఇదంతా సినిమాపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నప్పటికీ యాక్షన్ డ్రామా, విక్రమ్ నటన, మోషనల్ ఎలిమెంట్స్ తంగలాన్‌ను గట్టెకించే ఛాన్స్ ఉంది.