panipuri: పానీపూరీ ప్రియులకు బ్యాడ్ న్యూస్ .. పానీపూరీ పై నిషేధం !

Published 2024-07-03 20:31:35

postImages/2024-07-03/1720018895_panipurie1600837485731.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చిన్న లేదు పెద్ద లేదు..ఆడవాళ్లు మాగ్జిమమ్ ..పానీపూరీకి పడి చస్తారు. మాయదారి పానీ పూరీ లో ఏముందో ఏమో...పానీపూరీ వాడిని పెళ్లి చేసుకోమన్నా ...చేసేసుకుంటారు అంతపిచ్చి. మరి ఇప్పుడు ఆ పానీ పూరీ లవర్స్ అంతా ఏమైపోతారో..దేశంలో చాలా చోట్ల పానీపూరీని బ్యాన్ చేసేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పానీపూరీ బ్యాన్ చెయ్యడానికి ఆలోచన చేస్తుంది.


సాయంత్రం అయితే చాలు ...పానీపూరీ ..చాట్ ..మంచూరియా ఈ బండి ఎక్కడా ఖాళీగా కనిపించదు. జనాలు ఎగబడి మరీ తినేస్తున్నారు. అది హెల్దీనా కాదా వాళ్లకి అనవసరం . అయితే పానీపూరీలో హానికారక క్యాన్సర్ కారకాలున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. పానీ కలర్ రావడానికి అందులో కొన్ని ర‌సాయ‌నాల‌ను వాడుతున్న‌ట్లు కన్నడ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. ఈ త‌నిఖీల్లో భాగంగా సుమారు రాష్ట్రంలోని 276 షాపుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించడం జ‌రిగింది. ఇందులో 41 శాంపిల్స్‌లో ఆర్టిఫిషియల్ కలర్స్, క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. 


అందుకే కర్ణాటక ప్రభుత్వం పానీపూరీని బ్యాన్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి . ఇక‌, ఈ రాష్ట్రంతో పాటు మ‌రో రాష్ట్రం కూడా పానీపూరీ నిషేదంపై చ‌ర్య‌లు తీసుకోనుంది. కర్ణాటక తో పాటు , చెన్నై కూడా పానీపూరీ బ్యాన్ చెయ్యడానికి రంగం సిధ్ధం చేస్తున్నారు.  ఫుడ్ కలర్ లేకుండా టేస్టింగ్ సాల్ట్ లేకుండా ఉండే ఫుడ్ ని మాత్రమే తినాలని చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ కలర్స్ కారణంగా క్యాన్సర్లు వస్తున్నాయని తెలిపారు.


పానీ పూరీ లో ఉండే కలర్స్ వల్ల  అలర్జీ, హైపర్‌ యాక్టివిటీ, అరుగుదల వంటి సమస్యలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంటున్నారు. ఎక్కువ కాలం వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్సర్ బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని వైద్య నిపుణులు అంటున్నారు. టేస్టింగ్ సాల్ట్ , ఫుడ్ కలర్స్ కారణంగానే ఆరోగ్యసమస్యలు వస్తున్నట్లు తెలిపారు.