న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు గోస పడుతున్నారు. పాలకుర్తిలో రైతులకు యూరియా కొరత ఏర్పడింది. వారం రోజులుగా యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు యూరియా కోసం షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అధికారులు యూరియా వస్తుందని చెపుతున్నా, కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికే టొకెన్లు ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతు సేవ సహకార సంఘంలో నిల్వలు ఉన్న అధికారులు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం సరైన సమయంలో యూరియా సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి యూరియా కష్టాలు తీర్చాలని రైతులు కోరుతున్నారు.