పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
న్యూస్ లైన్ డెస్క్: పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రతి నెల 25 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
కనుమరుగవుతున్న కళలను గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు సీయం రేంవత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి జూపల్లి అన్నారు. అందులో భాగంగా ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప తదితరులకు ప్రతీ నెల25 వేల రూపాయల ప్రత్యేక పింఛన్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసినట్లు వివరించారు. ఇక నుంచి సాంస్కృతిక శాఖ ద్వారా పింఛన్ డబ్బులు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయి అని మంత్రి జూపల్లి వెల్లడించారు.