గద్దర్ అవార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వం కమిటీను ఏర్పాటు చేసింది.
న్యూస్ లైన్ డెస్క్: గద్దర్ అవార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వం కమిటీను ఏర్పాటు చేసింది. గద్దర్ అవార్డుల విధి విధానాల రూపకల్పన, లోగో, నిబంధనల కోసం ప్రభుత్వం 17 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్‌గా బి.నర్సింగరావు, కమిటీ వైస్ చైర్మన్‌గా దిల్ రాజు లను నియమించింది. గద్దర్ అవార్డుల కమిటీ సలహాదారులుగా కె.రాఘవేందర్ రావు, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, గుమ్మడి వెన్నెల, తనికెళ్ల భరిణి, డి.సురేష్ బాబు, చంద్రబోస్, నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్ శంకర్, బలగం వేణు లను ప్రభుత్వం నియమించింది.