Kcr Effect: భయపడిందా.. అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజులే

కాంగ్రెస్ ప్రభుత్వం హామీల ఎగవేతనే కాదు.. అసెంబ్లీ సమయంపై ఎగవేత ధోరణి అవలంబిస్తోందని మాజీ మంత్ర హరీష్ రావు మండిపడ్డారు.


Published Jul 23, 2024 05:31:41 AM
postImages/2024-07-23/1721725990_kcrbud.jfif

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం హామీల ఎగవేతనే కాదు.. అసెంబ్లీ సమయంపై ఎగవేత ధోరణి అవలంభిస్తోందని మాజీ మంత్ర హరీష్ రావు మండిపడ్డారు. మంగళవారం  అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద  ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజుల్లో కుదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కనీసం 15 రోజులు సమావేశాలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. డిమాండ్లపై రెండు రోజులే చర్చా.. ఇది దారుణం అన్నారు. గతంలో కేసీఆర్ హయాంలో తొమ్మిది రోజులు డిమాండ్లపై చర్చ జరిగేది అని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అసెంబ్లీ సమావేశాల పని దినాలు పెంచాలన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తోందని ప్రశ్నించారు. పాలకపక్షం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని, రేపటి ఎజెండా ఇంకా ఖరారు చేయలేదన్నారు. ఈ సాయంత్రం రేపటి చర్చను నిర్ణయిస్తే సభ్యులు ఎలా సిద్ధమవుతారని నిలదీశారు. 

నిరుద్యోగుల అంశంపై రేపు చర్చా చేపట్టాలని, తొమ్మిది అంశాలను చర్చకు ప్రతిపాదించామన్నారు. శాంతి భద్రతల వైఫల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, గ్యారంటీలు చట్టబద్ధత, రైతు రుణమాఫీ ఆంక్షలు, అన్ని పంటలకు బోనస్, రైతు భరోసా, పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య లోపం, స్థానిక సంస్థలకు నిధులు, ఫీజు రీఎంబర్స్‌మెంట్ చెల్లింపులు, గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు పెండింగ్ బిల్లులు లాంటి తొమ్మిది అంశాలు చర్చను పెట్టాలని కోరాం అని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదని, కాంగ్రెస్ బీజేపీలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి అని ఆరోపించారు. ఏపీ వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడారని, మరి తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు లేవా అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదని, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచి ఏం ప్రయోజనం అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏది అని ప్రశ్నించారు. తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం చేసిందని, తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని హరీష్ రావు పేర్కొన్నారు.

newsline-whatsapp-channel
Tags : kcr india-people ts-news revanth-reddy tspolitics congress latest-news telugu-news assembly-budget-session

Related Articles