Telangana Highcourt: హైడ్రాకు షాక్ ఇచ్చిన హైకోర్టు

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాకు హైకోర్టు ఉహించని షాక్ ఇచ్చింది. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.


Published Aug 28, 2024 06:55:54 AM
postImages/2024-08-28/1724842721_thydra.PNG

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాకు హైకోర్టు ఉహించని షాక్ ఇచ్చింది. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్‌లో కావూరి హిల్స్ పరిధిలో ఉన్న కొన్ని నిర్మాణాలకు హైడ్రా ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విజయసేన్ రెడ్డి కేవలం కొన్ని నిర్మాణాలకు మాత్రమే నోటీసులు ఇవ్వడం ఏంటని నిలదీశారు. అదే ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఇనార్బిట్ మాల్, రహేజా టవర్స్‌కి నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10-20 ఏళ్ల క్రితం నిర్మాణాలను ఇప్పుడు ఎందుకు ముట్టుకుంటున్నారని హైడ్రా తరుఫున హాజరైన ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్‌ను కూడా హైకోర్టు ప్రశ్నించింది.


ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన జీహెచ్‌ఎంసీ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు షూటిగా ప్రశ్నించింది. ముందుగా తప్పుచేసిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌‌లో లక్ష అనధికార నిర్మాణాలు ఉన్నాయి. వారందరికి నోటీసులు ఎందుకు జారీ చేయలేదు.. అసలు ఏ ప్రాతిపదికన నోటీసులు హైకోర్టు మండిపడ్డింది. కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన నిర్మాణాలను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. 

జీహెచ్ఎంసీ, హుడా నుంచి అనుమతులు పొంది గత 30-40 ఏళ్లగా నివాసం ఉంటున్న స్థలాలకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటని పిటిషనర్లు మండిపడ్డారు. కేవలం తమకు గిట్టని వాళ్ళు, ప్రతిపక్షాలను టార్గెట్ చేయడానికి మాత్రమే హైడ్రాను కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసుకుంటున్నదని వస్తున్న విమర్శలకు హైకోర్టు తాజా వ్యాఖ్యలు బలాన్నిచ్చాయి. ఈ నేపథ్యంలో హైడ్రా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా? ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన నిర్మాణాలకు కూడా నోటీసులు ఇస్తుందా అని పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : india-people telanganahighcourt hydra hydra-commissioner-ranganath

Related Articles