Telangana : మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మంది అధికారులను ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్‌ చేసింది.


Published Jun 24, 2024 04:14:52 AM
postImages/2024-06-24/1719217043_13.jpeg

న్యూస్ లైన్ డెస్క్ :   రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మంది అధికారులను ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఈ నెల 15వ తేదీనే అన్ని జిల్లాలకు కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం.. ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీఓ జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించారు.. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సుల్తానియాను నియమించింది. ఆయనకు ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదలచేశారు. చేనేత, హస్తకళల ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యను బదిలీ చేశారు. ఆమెకు హ్యాండ్లూమ్స్‌, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్‌ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆ స్థానంలో కొనసాగిన రొనాల్డ్‌ రోస్‌ను విద్యుత్‌ శాఖ కమిషనర్‌గా ట్రాన్స్‌ఫర్‌ చేశారు.  

newsline-whatsapp-channel
Tags : telangana-ias-transfers amrapali santhi-kumari

Related Articles