ఈసారి జులై నుండి బోనాల సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 5వ తేదిన గోల్కొండ మెట్ల పూజ జరపనున్నారు. ఈ నెల 7 నుండి గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం 8, 9, 10 తేదీల్లో బాల్కంపేటలో బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో ప్రతి ఏడాది ఆషాడ మాసంలో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. ఆషాడంలో మొదలయ్యే పండుగ శ్రావణ మాసంలో ముగుస్తుంది. అయితే, గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం చేయడంతో పండుగను ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలోని గ్రామాల్లో బోనాల పండుగను జరుపుకుంటారు.
కాగా, ఈసారి జులై నుండి బోనాల సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 5వ తేదిన గోల్కొండ మెట్ల పూజ జరపనున్నారు. ఈ నెల 7 నుండి గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం 8, 9, 10 తేదీల్లో బాల్కంపేటలో బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నారు.
21న ఉజ్జాయిని బోనాల సంబురాలు జరిపి 22న రంగం ఉండనుంది. ఓల్డ్ సిటీ బోనాల పండుగను 28న నిర్వహించనున్నారు. అక్కడ 29న రంగం జరగనుంది. కాగా, వచ్చే నెల 4 బోనాలకు చివరి రోజు. అయితే, ఆగస్టు 9వ తేదిన గోల్కొండ మెట్ల పూజ జరపనున్నారు.