భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు ఓ పూజారీ. అసభ్య పదజాలంతో విరుచు పడ్డాడు. దీంతో ఫైర్ అవుతున్నారు మహిళా భక్తులు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దసరా నవరాత్రుల్లో తెలంగాణ , ఏపీల్లో బతుకమ్మతో పాటు దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజులు దేవాలయాన్ని భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ముఖ్యంగా అమ్మవారి దేవాలయాల్లో విద్యుత్ దీపాలంకరణలో శోభాయమానంగా ఉన్నాయి. రోజుకో అవతారంలో అమ్మవారు నిన్న బాలాత్రిపురసుందరి అవతారంలో అమ్మవారు దర్శనం ఇచ్చింది. క్రమంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు ఓ పూజారీ. అసభ్య పదజాలంతో విరుచు పడ్డాడు. దీంతో ఫైర్ అవుతున్నారు మహిళా భక్తులు.
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిమిషాంబికా దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు అమ్మవారు బాలత్రిపురి సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు నిమిషాంబికాదేవి. అమ్మవారి దర్శనానికి భక్తులు గుడికి చేరుకోగానే షాక్ తిన్నారు. పట్టువస్త్రాలు దేదీప్యమానంగా ఉండాల్సిన అమ్మవారు...విగ్రహానికి గౌను ధరించడం చూసి ఆశ్చర్యానిక గురయ్యారు. అమ్మవారికి ఫ్రాక్ ధరింపజేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్మవారి రూపం చూసి ఇదేంటని అడగగా...బాలా త్రిపుర సుందరి రూపం గురించి ప్రశ్నించగా...అమ్మవారికి ఫ్రాక్ తొడుగుతారా అంటూ ప్రశ్నించింది. ప్రశ్నించిన భక్తులపై ఫుల్ సీరియస్ అయ్యారు. పూజారి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు. అతడు మాట్లాడుతున్న భాష వినడానికి చాలా అసహ్యంగా ఉందని, అతడిపై చర్యలు తీసుకోవాలంటూ మండిపడుతున్నారు. పూజారి దురుసుగా సమాధానం ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.