కలర్లు మీరెంత లావుగా ఉన్నా సన్నగా కనిపించేలా చేస్తాయి. శరీర కొవ్వును రంగులతో కూడా దాచిపెట్టొచ్చు అసలు ఆ రంగులు ఏంటో చూసేద్దాం..
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; కాస్త హెల్దీ గా ఉంటే చాలు అన్ని డ్రెస్సులు ఫిట్ కావు. కొన్ని స్లిమ్ గా కనిపిస్తాయి. మరికొన్ని మరీ దారుణంగా లావుగా కనిపిస్తాయి.అయితే కొన్ని కలర్స్ కూడా అందంగా కనిపించవు. కొన్ని రంగుల్లో మనం ఇంకా అందంగా కనిపిస్తాం.కానీ కొన్ని డ్రెస్సుల కలర్లు మీ వెయిట్ ను దాచేస్తాయి. అవేంటో చూద్దాం.
అవును కొన్ని కలర్లు మీరెంత లావుగా ఉన్నా సన్నగా కనిపించేలా చేస్తాయి. శరీర కొవ్వును రంగులతో కూడా దాచిపెట్టొచ్చు అసలు ఆ రంగులు ఏంటో చూసేద్దాం..
* నలుపు రంగు
పార్టీ కలర్...పార్టీస్ లో బ్లాక్ కనిపించినంత రిచ్ ..క్లాసీగా మరే కలర్ కనిపించదు. స్టైలిష్ కలర్.బ్లాక్ కలర్ డ్రెస్సులో మీరు ఎంత లావుగా ఉన్నా సన్నగానే కనిపిస్తారు. బ్లాక్ లో మీరు సన్నగా ఉంటారనేది నిజం.
* నీలం రంగు
డార్క్ నీలం రంగు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ చాలా మంది ఈ రంగు డ్రెస్సులను ధరించరు. నల్లగా కనిపిస్తామనుకుంటారు .కాని మీరు కాని కాస్త వెయిట్ ఉంటే ఈ కలర్ వేసుకొండి స్లిమ్ గా కనిపిస్తారు.
* డార్క్ పర్పుల్ ఒకటి ..ఉదా రంగు ఒకటి ..ఈ కలర్ కాకుండా డార్క్ మెరూన్ కలర్ డ్రెస్సులను కూడా మీరు వేసుకోవచ్చు. వీటిలో కూడా మీరు స్లిమ్ గా కనిపిస్తారు.
*ఎమరాల్డ్ గ్రీన్ కలర్ మీరు సన్నగా, అందంగా కనిపించాలంటే ఎమరాల్డ్ గ్రీన్ కలర్ డ్రెస్సులను వేసుకోండి. ఈ రంగు దుస్తులు చాలా రాయల్ లుక్ ను ఇస్తాయి.
నిజానికి ఇవేం వెయిట్ ను దాయవు కాని ..ఆ కలర్లు మీ వెయిట్ దాస్తున్నట్లు ఎదుటి వ్యక్తి భ్రమింపచేస్తాయి. దీని వల్ల మీ హెవీ బాడీ స్లిమ్ గా కనిపిస్తుంది.