రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చి అద్భుతమైన హిట్ సాధించాడు. ఆ తర్వాత కుమారి 21ఎఫ్ సినిమాతో తన రేంజ్ ఎక్కడికో
Thiragabadarasami Review Rating: న్యూస్ లైన్ డెస్క్:రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చి అద్భుతమైన హిట్ సాధించాడు. ఆ తర్వాత కుమారి 21ఎఫ్ సినిమాతో తన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. వరుసగా నాలుగైదు సినిమాలు హిట్లు కొట్టిన రాజ్ తరుణ్ ఆ తర్వాత వరుసగా ప్లాపులు అందుకుంటున్నారు. ఇలా పడుతూ లేస్తూ వెళ్తున్న రాజ్ తరుణ్ జీవితంలో లావణ్య వివాదం మరో ఇబ్బంది పెట్టే అంశముగా మారింది. ఈ తరుణంలోనే ఆయన హీరోగా చేసినటువంటి తిరగబడరసామీ ఆగస్టు 2న థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉంది విశేషాలు ఏంటో చూద్దాం.
యంగ్ యాక్టర్ రాజ్ తరుణ్ హీరోగా, మాల్వి మల్హోత్రా, మన్నార చోప్రా హీరోయిన్లుగా నటించిన చిత్రం తిరగబడరా స్వామి. ఏఎస్ రవి కుమార్ చౌదరి, దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సురక్ష ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సారథ్యంలో మల్కాపురం శివకుమార్ నిర్మించారు.
కథ:
ఈ చిత్రంలో హీరో రాజ్ తరుణ్ పిరికి వాని క్యారెక్టర్ లో నటించారు. ప్రతి దానికి భయపడుతూ చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోడు. కానీ హీరోయిన్ మాత్రం చాలా దూకుడుగా వైలెంట్ ఉంటుంది. అక్కడక్కడ ఫైట్లు కూడా చేస్తూ హీరోకే చుక్కలు చూపిస్తుంది. ఇలా ఇద్దరి మధ్య జరిగినటువంటి లవ్ స్టోరీలో, హీరోయిన్ ను కంట్రోల్ చేయలేక హీరో పడుతున్నటువంటి తిప్పలు, హీరో మళ్లీ ధైర్యం తెచ్చుకొని తిరగబడతాడు. ఈ టైంలో వచ్చిన గొడవల్లో అంతిమ విజయం రాజ్ తరుణ్ ఎలా సాధిస్తాడా.. గెలిపించుకుంటాడా లేదా అనేది పూర్తి కథ సినిమా చూస్తే అర్థమవుతుంది.
వివరణ:
ఈ చిత్రంలో మొదటి భాగం విషయానికి వస్తే అంతా కామెడీతో సాగుతుంది. హీరోయిన్ హీరో ను చాలా డామినేషన్ చేస్తూ విపరీతమైనటువంటి కామెడీ క్రియేట్ అవుతుంది. ఈ సమయంలోనే హీరో హీరోయిన్ మధ్య లవ్ మొదలైపోతుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత రెండవ భాగంలో ట్విస్ట్ లు మొదలవుతాయి. రెండో భాగంలో మొత్తం హీరోకు సంబంధించిన ఎలివేషన్, యాక్షన్స్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. మధ్య మధ్యలో కామెడీ కూడా అదుర్స్ అనిపిస్తుంది. ఇక హీరోయిన్ల గ్లామర్ డోస్ మాత్రం చెప్పనక్కర్లేదు. రొమాన్స్, ఎలివేషన్ సీన్స్, సాంగ్స్, ఇలా అన్ని ఈ చిత్రానికి కలిసి వచ్చాయి. కానీ రాజ్ తరుణ్ ను ఇంతకుముందులా కాకుండా సరికొత్త లుక్ లో చూపించగలిగాడు డైరెక్టర్. ఎన్నో మాస్ యాంగిల్స్ లో కూడా హీరో కనిపిస్తారు. సినిమాటోగ్రఫీ విజువల్ ఎడిటింగ్ సంగీతం అన్ని ఓకే అనిపించాయి.
నటీనటులు:
హీరో రాజ్ తరుణ్ ఇంతటి హెవీ ఫైట్ యాక్షన్ సీన్స్ ఇప్పటివరకు చేయలేదని చెప్పవచ్చు. ఈయన ఓవర్ మాస్ యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా నటిస్తారని చిత్రం చూస్తే అర్థమవుతుంది. ఇక మాల్వి మల్హోత్రా తెలుగులో మొదటి సినిమా. ఈమె తన గ్లామర్ తో క్యారెక్టర్ తగ్గట్టుగా అద్భుతంగా నటించింది. ఇక సెకండ్ హీరోయిన్ మన్నారా చోప్రా కూడా తన యాక్టింగ్ స్కిల్స్ అన్నింటిని బయటపెట్టి అదరహో అనిపించింది. జాన్ విజయ్, రఘుబాబు, అంకిత ఠాకూర్, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి వారి వారి పాత్రల మేరకు కామెడీతో అదరగొట్టేసారు. యాక్షన్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం ఎక్కువగా నచ్చుతుంది.
చివరగా:
హీరో హీరోయిన్ మధ్య ఏర్పడిన లవ్, దాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి ఇబ్బందులు పడతారు. జీవితంలో ఏ సమస్యలు వస్తే ఎలా ఎదుర్కొంటారు అనే విధానాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. మొత్తానికి అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
రేటింగ్:3/5