సీఎం సోదరుడికి హైడ్రా నోటీసులు వచ్చిన నేపథ్యంలో పలు మీడియా సంస్థలు ఆయన ఇంటిపై తప్పుడు ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. ఆ ఇల్లు తిరుపతిరెడ్డికి చెందినది కాదని, అందులో ఆయన అద్దెకు ఉంటున్నారని తప్పుడు వార్తలు ప్రసారం చేశాయి.
న్యూస్ లైన్ డెస్క్: మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు నిర్మించుకున్నారు. అయితే, ఇది దుర్గం చెరువు FTL పరిధిలోని సర్వే నంబర్ 47లో ఉండడంతో హైడ్రా కమిషన్ ఆయనకు నోటీసులు పంపించింది. చెరువుకు సంబంధించిన స్థలంలో అక్రమంగా ఇల్లు నిర్మించారని.. నెల రోజుల్లో కూల్చేయాలని హైడ్రా నోటీసుల్లో పేర్కొంది.
సీఎం సోదరుడికి హైడ్రా నోటీసులు వచ్చిన నేపథ్యంలో పలు మీడియా సంస్థలు ఆయన ఇంటిపై తప్పుడు ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. ఆ ఇల్లు తిరుపతిరెడ్డికి చెందినది కాదని, అందులో ఆయన అద్దెకు ఉంటున్నారని తప్పుడు వార్తలు ప్రసారం చేశాయి. దీంతో ఈ అంశంపై తిరుపతిరెడ్డి స్పందించారు.
తాజగా, ఈ అంశంపై తిరుపతిరెడ్డి స్పందించారు. అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలోని భూమిని 2015లో కొనుగోలు చేశానంటూ శేరిలింగంపల్లి రెవిన్యూ అధికారులకు ఆయన ఓ లేఖ రాశారు. ఆ భూమి దుర్గం చెరువు FTL పరిధిలో ఉందనే విషయం భూమి కొనుగోలు చేసిన సమయంలో తనకు తెలియదని తెలిపారు.
తన ఇల్లు FTL పరిధిలో ఉందని ప్రభుత్వం నిర్దారిస్తే హైడ్రా తీసుకునే ఎలాంటి చర్యలకైనా తాను సిద్ధమని తెలిపారు. ఆక్రమణలను పరిష్కరించడానికి దిద్దుబాటు చర్యలకు హతాను అభ్యంతరం తెలపబోనని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం ఇల్లు ఉన్న స్థలం కోటేశ్వర్ రావు అనే పేరుతో రిజిస్టర్ చేసి ఉండడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.