ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. నగర వ్యాప్తంగా భక్తుల సౌకర్యార్థం 175 బస్సులు నడపలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిర్ణయించారు.
న్యూస్ లైన్ డెస్క్: ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. నగర వ్యాప్తంగా భక్తుల సౌకర్యార్థం 175 బస్సులు నడపలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. హైదరాబాద్ లోని 24 ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో రానున్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, పటాన్ చెరు, ఈసీఐఎల్, మెహిదీపట్నం, దిల్ షుక్‌నగర్, కూకట్‌పల్లి, చార్మినార్, ఉప్పల్, మల్కాజిగిరి, పాత బోయిన్‌పల్లి, మల్కాజిగిరి, తదితర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. బోనాలకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎండీ సజ్జనార్ సూచించారు.
ఇక ఆదివారం జరిగే శ్రీ ఉజ్జయినీ మహంకాళి జాతరకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నార్త్ జోన్ డిసిపి రష్మి పెరుమాళ్ తెలిపారు. పదిహేను వందల మంది పోలీసులు, వంద సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బోనాలు తీసుకొచ్చే మహిళలకు వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్స్, సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా జర్నల్ క్యూ లైన్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. శివసత్తులకు ఒంటి గంట నుండి నాలుగు గంటల వరకు సమయం ఇచ్చామని, సీనియర్ సిటీజన్స్ కు, వికలాంగులకు అవుసరాన్ని బట్టి ప్రత్యేక వేకిల్ ద్వారా తీసుకొచ్చి దర్శనం చేయించనున్నట్లు తెలిపారు. టెంపుల్ కు వచ్చే భక్తుల వాహనాల కోసం తెంపుల్ దగ్గర్లో పార్కింగ్ ఏర్పాటు ట్రాఫిక్ డిపిపి రాహుల్ పేర్కొన్నారు.