TTD: నవంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల !

నవంబరు నెల కోటాను ఆగష్టు 19వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.


Published Aug 13, 2024 07:53:00 PM
postImages/2024-08-13/1723559099_TTD.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమల భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ నెలకు గాను శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు నవంబరు నెల కోటాను ఆగష్టు 19వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.


ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగష్టు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ డిప్ లో విన్నర్స్  ఆగష్టు 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరు అవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను, అదేవిధంగా నవంబరు 9వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవ టికెట్లను ఆగష్టు 22వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 


నవంబరు నెల కోటాను ఆగష్టు 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇవి వర్చువల్ సేవల కోసం ఈ నెల 22 వతేదీ 3 గంటలకు ఈ సేవ టికెట్లు రిలీజ్ చేస్తారు. దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఆగష్టు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.


తిరుమల, తిరుపతిల‌లో నవంబరు నెల గదుల కోటాను ఆగష్టు 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఆగష్టు 27వ తేదీన తిరుమ‌ల, తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu venkatewsra-temple tirupati

Related Articles