మధ్యప్రదేశ్ లో ఓ తండ్రి తన కొడుకు ను తులాభారంలో కూర్చొబెట్టి ..తన బరువుకు సరిసమానంగా నోట్ల కట్టలు తూకం వేయించాడు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మనం అనుకున్న కోరిక తీరాలే కాని ఎంత పెద్ద మొక్కు అయినా తీరుస్తాం. అది భగవంతుడు మీద మనకున్న నమ్మకం. మధ్యప్రదేశ్ లో ఓ తండ్రి తన కొడుకు ను తులాభారంలో కూర్చొబెట్టి ..తన బరువుకు సరిసమానంగా నోట్ల కట్టలు తూకం వేయించాడు. ఎందుకు ఇలా చేశారంటే.
మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని జిల్లా బద్‌నగర్‌లో తేజ దశమి పండుగ సందర్భంగా, ఒక తండ్రి, తన కోరిక నెరవేరినందుకు గాను తన కొడుకు కు తులాభారం ఇచ్చాడు. అది కూడా 30 యేళ్ల తర్వాత ..తన కొడుకు 82 కిలోల బరువుకు సమానమైన డబ్బుతో తూకం వేశారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణానికి 10 లక్షల 7 వేల రూపాయల విరాళం కూడా ఇచ్చాడు. తేజ దశమి సందర్భంగా మంగళనాథ్ పాత్ ప్రాంతానికి చెందిన చతుర్భుజ్ జాట్ ఈ పని చేశారు.
చతుర్భుజ్ జాట్4 సంవత్సరాల క్రితం తను అనుకున్న పని జరిగితే తన కొడుకు ఎంత బరువు ఉంటాడో అంత బరువు నోట్ల కట్టలు ఇస్తానని మొక్కుకున్నాడట , తన కొడుకు బరువుతో సమానమైన మొత్తాన్ని తేజాజీ మహారాజ్ ఆలయానికి విరాళంగా ఇస్తానని మొక్కుకున్నాడట. ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకున్నాడు. ఈ అపూర్వ విరాళాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. స్వామి దయతో నా కోరిక తీరింది. ఈ డబ్బును దేవాలయం వారు ఆలయ నిర్వాహణకు ..చిన్న చిన్న మార్పు చేర్పులకు ఉపయోగిస్తారని తెలిపారు.