ఆయనకు మద్దతుగా ఆదివారం ఆస్పత్రి ఆవరణలో విద్యార్థి సంఘాల నాయకులు నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: మెయిన్ స్ట్రీమ్ మీడియా(Main stream media) అమ్ముడుపోయిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం(Government) పట్టించుకోవడం లేదని గత కొంత కాలంగా నిరుద్యోగులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్(congress) ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్(job calendar) రిలీజ్ చేస్తామన్న హామీని కూడా అమలు చేయాలని నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు అన్నీ ఒకదాని తర్వాత మరొకటి ఉండడంతో తమ మీద ఒత్తిడి పెడుతున్నట్లే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రూప్స్ అభ్యర్థులు(groups aspirants), నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రి(Gandhi hospital)లో విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్(Motilal Nayak) ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయనకు మద్దతుగా ఆదివారం ఆస్పత్రి ఆవరణలో విద్యార్థి సంఘాల నాయకులు నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ABN, V6, ETV తమ సమస్యలను చూపించడం లేదని మండిపడ్డారు. కుమారి ఆంటీ వార్తలను తిప్పి తిప్పి అన్ని సార్లు చూపించిన ఛానెళ్లకు ఇప్పుడు నిరుద్యోగుల బాధలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.