Upasana:'స్వాతంత్ర్యం' గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఉపాసన.!

దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా  జాతీయ జెండాను ఆవిష్కరించి సంబరాలు చేసుకుంటున్నారు ప్రజలు. ఊరువాడ నుంచి మొదలు  ఢిల్లీ కోట


Published Aug 15, 2024 10:48:59 AM
postImages/2024-08-15/1723699139_upasana.jpg

న్యూస్ లైన్ డెస్క్: దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా  జాతీయ జెండాను ఆవిష్కరించి సంబరాలు చేసుకుంటున్నారు ప్రజలు. ఊరువాడ నుంచి మొదలు  ఢిల్లీ కోట దాకా జనగణమన అంటూ అభిమానం చేస్తున్నారు. ఇలా మనకు స్వాతంత్రం వచ్చి  ఏడు దశాబ్దాలు గడిచినా కానీ కొన్ని విషయాల్లో మాత్రం వెనకబడిపోయామని కొంతమంది ప్రముఖులు అంటున్నారు.

https://x.com/upasanakonidela/status/1823899265212563645?s=19

దీంతో స్వాతంత్ర దినోత్సవంపై  మెగా కోడలు ఉపాసన కొనిదెల కాస్త భావోద్వేగా  మాటలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇంతకీ ఆమె ఏమన్నది అంటే.. తాజాగా కోల్ కత్తాలో మహిళా వైద్యురాలిపై  జరిగినటువంటి హత్యాచార ఘటన ఆమెను తీవ్రమైన మనోవేదనకు గురి చేసిందట.  ఇది మానవత్వాన్ని అపహాస్యం చేసే ఘటన అని చెప్పుకొచ్చింది. ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా కానీ సమాజంలో అనాగరికత పెరిగిపోయిందని, అసలు మనం ఎలాంటి స్వాతంత్ర్యం జరుపుకుంటున్నాం..  దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే కీలకం..

అలాంటి వారిపై జరిగిన దాడులు తీవ్రంగా బాధపెడుతున్నాయని ఉపాసన ట్వీట్ చేసింది. అంతేకాదు ఎక్కువ మంది స్త్రీలను వర్క్ ఫోర్సులోకి తీసుకురావాలని, వారి భద్రతతో పాటు గౌరవం అందించడం కోసం అందరం కలిసి కృషి చేయాలని  ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఉపాసన చేసిన ఈ ట్విట్  ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారింది. దీనిపై చాలామంది మెగా అభిమానులు స్పందిస్తూ  అవును ఈ సమాజంలో అనాగరికత పెరిగిపోతోందంటూ కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi news-line upasana nagachaitanya- indipendence-day

Related Articles