ఎలక్ట్రిక్ వెహికల్సే. మరోవైపు బజాజ్ కంపెనీ ఫ్రీడమ్ 125 CNG బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పెట్రోల్ రేట్లు చూసి జనాలు ..ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నారు. ఇప్పుడు హవా అంతా ఎలక్ట్రిక్ వెహికల్సే. మరోవైపు బజాజ్ కంపెనీ ఫ్రీడమ్ 125 CNG బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే వీటికి పోటీగా నీటితో నడిచే బండిని పరిచయం చేస్తున్నారు. జాయ్ ఇ-బైక్ నీటితో నడిచే స్కూటర్‌ను లాంచ్ చేసి దీనిని సాధ్యం చేసింది.
జాయ్ ఈ-బైక్ కంపెనీ వార్డ్‌విజార్డ్ ఈ పని చేసింది. హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ అండ్ ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీపై పనిచేసే కంపెనీ నీటితో నడిచే స్కూటర్‌ను విడుదల చేసింది. ఇంకా కాలుష్యాన్ని నివారించడానికి సహాయపడుతుంది. నిజానికి ఈ స్కూటర్ డిస్టిల్డ్ వాటర్‌తో నడుస్తుంది.
ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కి.మీ. ఈ స్కూటర్ స్పీడ్ తక్కువ. ఈ స్కూటర్ నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అంతే కాదు..దీనికి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఈ స్కూటర్‌ను నడపవచ్చు. చాలా ఆటోమొబైల్ కంపెనీలు హైడ్రోజన్ పవర్డ్ వాహనాలను పరిచయం చేయడంపై దృష్టి సారిస్తున్నాయి. ఒక లీటర్ డిస్టిల్డ్ వాటర్‌తో 150 కిలోమీటర్లు వెళ్లగలదు. ప్రస్తుతం ఈ ఇ-స్కూటర్ గురించి చర్చ జరుగుతోంది.