ఏప్రిల్ నుంచి జులై వరకు వెనిస్ నగరం పర్యటనకు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సోషల్ మీడియా వచ్చాక ..ఎక్కడ అందమైన ప్లేసులు కనిపిస్తే ఆ ప్లేస్ కు చెక్కేస్తున్నారు . అందంగా ఉందని చెప్తే చాలు నెక్స్ట్ ప్లాన్ అక్కడికే. అయితే ఇలా టూరిస్టుల బాధపడలేక ...తలలు పట్టుకుంటున్నారు వెనీస్ అధికారులు. జనాల తాకిడి అసలు తట్టుకోలేక లాస్ట్ ఇయర్ ట్యాక్స్ పెంచారు. ఇప్పుడు ఆ ట్యాక్స్ ను మరింత పెంచారు. వెనిస్ లోకి పర్యాటకులు ప్రవేశించాలంటే ప్రత్యేకంగా పాస్ తీసుకోవాలని కిందటేడాది రూల్ తీసుకొచ్చింది. ఏప్రిల్ నుంచి జులై వరకు వెనిస్ నగరం పర్యటనకు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. వచ్చే సీజన్ కు వెనీస్ రెడీ అవుతుంది.
టూరిస్టుల రద్దీని నియంత్రించడానికి పన్నులు పెంచింది. నగరంలో అడుగుపెట్టడానికి గతంలో రోజుకు 5 యూరోలు (మన కరెన్సీలో రూ. 453) చెల్లించి పాస్ తీసుకోవాల్సి ఉండగా ఈ ఏడాది దీనిని 10 యూరోల (రూ. 906)కు పెంచింది. అయితే, పర్యటనకు కేవలం నాలుగు రోజుల ముందు పాస్ తీసుకునే పర్యాటకులకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని, అంతకంటే ముందు తీసుకుంటే 5 యూరోలే వసూలు చేస్తామని చెప్పింది. ఈ పాస్ తీసుకున్న పర్యాటకులు ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వెనిస్ లో విహరించవచ్చని పేర్కొంది.
వెనీస్ నగరం అందాల కోసం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత అందమైన ప్లేసులు చూడడానికి చాలా దేశాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. వీరి రద్దీ ని కంట్రోల్ చెయ్యడానికి వెనీస్ ఈ నిర్ణయం తీసుకుందట. చూడాలి మరి ఈ సీజన్ లో ఈ టూరిస్టుల రద్దీని వెనీస్ ఎలా మ్యానేజ్ చేస్తుందో చూడాలి.