రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు భక్తులు నియమ నిష్ఠలతో పూజలు చేస్తారు. అలాంటి వినాయక చతుర్థి పండగను మొదటి రోజు నుంచి మొదలు 9
న్యూస్ లైన్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు భక్తులు నియమ నిష్ఠలతో పూజలు చేస్తారు. అలాంటి వినాయక చతుర్థి పండగను మొదటి రోజు నుంచి మొదలు 9 రోజుల వరకు వివిధ రకాల పూజలతో, వివిధ ప్రసాదాలతో దేవున్ని ఆరాధిస్తారు. మరి ఈ తొమ్మిది రోజులపాటు ఎలాంటి పూజ చేయాలి. ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి అనే వివరాలు చూద్దాం.. వినాయకుడు మొదటి రోజున వరసిద్ధి వినాయకుడి రూపంలో మనకు దర్శనం ఇస్తాడు. ఈరోజు ప్రత్యేకంగా ఉండ్రాళ్ళను నివేదనగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది.
ఇక వినాయకుడిని రెండవ రోజు స్వామి వారిని వికట రూపంలో పూజ చేయాల్సి ఉంటుంది. రెండవ రోజు అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే మనకు విద్యాబుద్ధులు కలుగుతాయి. ఇక మూడవ రోజు స్వామివారిని లంబోదరుడిగా కొలుస్తారు. ఈరోజు స్వామివారికి పేలాలను నివేదిస్తే, సౌభాగ్యం కలుగుతుందట. నాలుగవ రోజు గజానన రూపంలో కొలవాలట. ఈరోజు చెరుకును నైవేద్యంగా పెడితే, సంతాన భాగ్యం కలుగుతుందట. ఐదవ రోజున మహోదర రూపంలో స్వామివారిని కొలవాలట ఈ రోజున కొబ్బరిని నివేదనగా సమర్పిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయట. ఆరవ రోజు ఏకదంతా రూపంలో కొలవలట. నువ్వులను నైవేద్యంగా సమర్పిస్తే మనకు ఆత్మస్థైర్యం పెరుగుతుందట. ఏడవ రోజున వక్రతుండ రూపంలో కొలవలట.
ఈరోజు అరటి పండ్లను నైవేద్యంగా పెడితే ఇలా చేసిన వారికి ఉద్యోగాలు రావడమే కాకుండా ఆర్థికంగా బలపడతారట. ఎనిమిదవ రోజున విజ్ఞరాజ రూపంలో దర్శనమిస్తాడట. సత్తుపిండిని నైవేద్యంగా పెడితే సిరిసంపదలు కలుగుతాయట. 9వ రోజు రూపంలో స్వామివారిని ధూమ్ర వర్ణుడి రూపంలో పూజించి, నేతి అప్పాలను నివేదనగా పెట్టాలట. ఇలా చేస్తే ఏ పని చేసిన ఫలితాలు ఉంటాయట. ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా నైవేద్యాలు పెట్టి స్వామి వారిని కొలిస్తే వారు ఏ కోరిక కోరుకున్న తప్పకుండా నెరవేరుతాయని పండితులు అంటున్నారు.