Vinesh Phogat: వినేశ్ ఫోగాట్ అప్పీల్ పై తీర్పు మళ్లీ వాయిదా..!

లంపిక్స్ .భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగాట్... సీఏఎస్ తీర్పుపై మరో మూడ్రోజులు నిరీక్షించకతప్పదు. వినేశ్ ఫోగాట్ అప్పీల్ పై తీర్పు మళ్లీ వాయిదా పడింది.


Published Aug 14, 2024 08:00:00 AM
postImages/2024-08-14/1723602665_vineshphogat.avif


న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: రీసెంట్ గా పారిస్ ఒలంపిక్స్ లో 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంగా కళ్ల ముందున్న బంగారు పతక కల ను చెరిపేసింది ఒలంపిక్స్ .భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగాట్... సీఏఎస్ తీర్పుపై మరో మూడ్రోజులు నిరీక్షించకతప్పదు. వినేశ్ ఫోగాట్ అప్పీల్ పై తీర్పు మళ్లీ వాయిదా పడింది. తనను అనర్హత వేటుపై బయటకు పంపేసినా ...కనీసం సిల్వర్ మెడల్ అయినా తనకు రావాలని వినేశ్ ఫొగాట్ అప్పీల్ ఫైల్ చేశారు. ఆ కేసు తీర్పు మళ్లీ వాయిదా పడింది. 


ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 50 కిలోల కేటగిరీలో ఫైనల్ ఆడాల్సిన వినేశ్ ఫోగాట్ ను అధిక బరువు కారణంగా అనర్హురాలిగా ప్రకటించారు. దాంతో వినేశ్ పారిస్ లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తాత్కాలిక బెంచ్ ను ఆశ్రయించింది. వినేశ్ తరఫున భారతదేశ ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వాదనలు వినిపించారు. తను ఫైనల్స్ కు అర్హత సాధించలేకపోయాను . కాని సెమీ ఫైనల్స్ లో నేను గెలిచాను...అప్పడు నాకు వెండి పతకం అయినా రావాలి కదా అని భారతీయ న్యాయవాదులు వాదిస్తున్నారు.


ఇవాళ తీర్పు వస్తుందని, వినేశ్ కు రజత పతకం ఖాయమవుతుందని అందరూ ఆశించారు. అయితే, వినేశ్ అప్పీల్ పై తీర్పును సీఏఎస్ ఆగస్టు 16కి వాయిదా వేసింది. వినేశ్ ఫోగాట్ వర్సెస్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వర్సెస్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కేసులో ఆర్బిట్రేటర్ డాక్టర్ అనబెల్లే బెన్నెట్ వాదనలు కూడా వినాలని సీఏఎస్ నిర్ణయించిందని, అందుకే తీర్పు వాయిదా వేశారని తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu vinesh-phogat wrestling

Related Articles