మరోసారి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు దగా జరిగిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన స్పందించారు.
న్యూస్ లైన్ డెస్క్: మరోసారి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు దగా జరిగిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన స్పందించారు. బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ తెలంగాణ ఊసేలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి అనుగుణంగా నిధులు కేటాయిస్తానని చెప్పారు. కానీ, అమరావతికి మాత్రమే రూ.15 వేల కోట్లు కేటాయించారని ఆయన తెలిపారు. ఏపీలోని శ్రీకాకుళం చెన్నై కారిడార్ గురించి ప్రస్తావించారు. అదే సమయంలో హైదరాబాద్, నాగ్‌పూర్ కారిడార్‌కు కూడా నిధులు కేటాయిస్తే బాగుండేదన్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్, బీజేపీ నుంచి 16 మంది ఎంపీలు ఉన్న తెలంగాణకు దక్కింది గుండు సున్నానే అన్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్‌కు కేంద్ర బడ్జెట్‌లో భారీ నిధులు కేటాయించిందని ఆరోపించారు. తెలంగాణకు ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, నవోదయ విద్యాలయాలు, రైల్వే లైన్లు తదితర విషయాల్లో ఎంపీలు పట్టుబట్టి బడ్జెట్ సాధించుకోవాలన్నారు.