న్యూస్ లైన్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలు వరద ప్రభావంతో నీట మునిగాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాల మధ్య రాకపోకలకు సైతం ఇబ్బంది ఏర్పడింది. సోమవారం నాటికి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టి పరిస్థితులు కాస్త అదుపులోకి వస్తున్నాయనుకునే లోపే మరో వార్త ఏపీ ప్రజలను భయపెడుతోంది.
రానున్న రెండు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటన చేసింది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకోని ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాజస్థాన్ లోని జైసల్మేర్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకు రుతుపవన ద్రోణి ఆవరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ప్రజలు వదరల్లో మునిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే రానున్న తుఫాను ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అని జనాలు ఆందోళన చెందుతున్నారు.