ఒక నర్స్ ఉందన్న విషయం తెలుసుకున్న కండక్టర్ ఆమె సహాయంతో బస్సులోనే మహిళకు పురుడు పోశారు. ఆర్టీసీ బస్సులోనే ప్రసవించిన సంధ్య పండంటి పాపకు జన్మనిచ్చింది.
న్యూస్ లైన్ డెస్క్ : తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సీట్ల కోసం గొడవలు, బస్సులో అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీస్తున్నారూ అంటూ వైరల్ వీడియోలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఓ హృదయాన్ని కదిలించే ఘటన అదే ఆర్టీసీ బస్సులో జరిగింది. అదేంటంటే..
రాఖీ పండుగ నాడు #TGSRTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి… pic.twitter.com/nTpfVpl5iT — VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) August 19, 2024
రాఖీ పండుగ సందర్భంగానాసినల్లి గ్రామానికి చెందిన సంధ్య గద్వాల నుంచి తల్లిగారింటికి అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు బయలుదేరింది. 9 నెలల నిండు గర్భిణి అయిన సంధ్యకు గద్వాల మండలంలోని కొండపల్లి దగ్గరకు వచ్చేసరికి సడెన్ గా పురిటినొప్పులు రావడం మొదలైంది. విషయం తెలుసుకున్న మహిళా కండక్టర్ వెంటనే విషయాన్ని డిపో మేనేజర్ కి తెలిపారు. సమీపంలో ఒక నర్స్ ఉందన్న విషయం తెలుసుకున్న కండక్టర్ ఆమె సహాయంతో బస్సులోనే మహిళకు పురుడు పోశారు. ఆర్టీసీ బస్సులోనే ప్రసవించిన సంధ్య పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లీకూతురు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ప్రసవానంతరం 108కి ఫోన్ చేసి తల్లీబిడ్డలను వనపర్తి దవాఖానాకు తరలించారు. ఈ విషయమై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మహిళకు ప్రసవం చేసిన కండక్టర్ ను ప్రశంసించారు.