Airplane:విమానంలో ఫుడ్ ఎందుకు టేస్టీగా ఉండదో తెలుసా.?

సాధారణంగా ఫ్లైట్ లో ప్రయాణించేవారు కొన్ని గంటల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.  ఈ ప్రయాణ సమయంలో వారు ఫ్లైట్లోనే భోజనం చేస్తూ ఉంటారు.  అయితే ఫ్లైట్లో తినే ఆహారం టేస్ట్ గా


Published Aug 27, 2024 10:29:47 AM
postImages/2024-08-27/1724734787_flightfood.jpg

న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా ఫ్లైట్ లో ప్రయాణించేవారు కొన్ని గంటల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.  ఈ ప్రయాణ సమయంలో వారు ఫ్లైట్లోనే భోజనం చేస్తూ ఉంటారు.  అయితే ఫ్లైట్లో తినే ఆహారం టేస్ట్ గా ఉండదని చాలామంది ఫిర్యాదు చేస్తారు. దీనికి ఒక కారణం ఉందట. అదేంటో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా రైల్లో కానీ, బస్సులో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు మనం మన ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకెళ్లవచ్చు. ఆ ప్రయాణ సమయంలో మనం తయారు చేసుకున్న ఆహారాన్ని ఎంచక్కా తినవచ్చు.  

కానీ విమానంలో వెళ్లే సమయంలో అధి కుదరదు. కొన్ని వస్తువులను తీసుకెళ్లడంపై అనేక ఆంక్షలు ఉంటాయి. ఎక్కువ దూరం ప్రయాణించే సమయంలో మీరు విమానంలో లభించే ఆహారాన్ని మాత్రమే తినవలసి ఉంటుంది. ఈ సందర్భంలో చాలామంది ఆహారం టేస్టీగా ఉండదని ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. అయితే విమానంలో పెట్టే ఆహారం టేస్టీగా ఉండకపోవడానికి ఒక కారణం కూడా ఉందట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. లైట్ లో మనకు అందించే ఆహారం టేస్ట్ పై ఇప్పటికీ కూడా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అప్పుడు టేస్ట్ లేకపోవడానికి కారణం ఏంటో ఇప్పటివరకు కూడా కనిపెట్టలేకపోయారు.

అయితే దీనికి ప్రధాన కారణం గాలిలో తేమ అధిక స్థాయికి చేరుకున్న తర్వాత  నాలుకపై ఉండే రుచి గ్రంధులపై ప్రభావం ఏర్పడుతుందట. కేవలం రుచి మాత్రమే కాకుండా వాసన చూసే సామర్థ్యాన్ని కూడా  తగ్గిస్తుందట.  దీంతో మనం తినే ఆహారం అంతగా రుచి అనిపించదట. అయితే ఫ్లైట్లో ప్రయాణించే సమయంలో క్యాబిన్ లో తక్కువ గాలి ఒత్తిడి ఉంటుంది. అంతేకాదు తేమ లేకపోవడం శబ్దం ఎక్కువగా ఉండటం వల్ల వాసన చూసే సామర్థ్యం కూడా తగ్గుతుందట.  దీనివల్ల మనం రుచి చూసే స్థాయిని కోల్పోతామని నిపుణులు అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu flight food, taste flightservices

Related Articles