viral: స్వఛ్ఛంధ సంస్థ కోసం ఇంగ్లీష్ ఛానల్ ఈదిన 16 ఏళ్ల అమ్మాయి!

రీసెంట్ గా  ఓ అమ్మాయి నిరుపేదలకు సాయం చెయ్యాలని  ఓ పెద్ద సాహసం చేసింది అది కూడా 16 యేళ్ల అమ్మాయి. 


Published Sep 12, 2024 12:26:00 PM
postImages/2024-09-12/1726124300_Screenshot20240912121843.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నేటి కాలంలో మనుషుల్లో స్వార్ధం పెరిగింది. వేరే వాళ్ల కోసం మనం ఆలోచించే టైం కూడా వేస్ట్ చెయ్యడం లేదు. అనాధలు కోసం ఆలోచించే వాళ్లు చాలా తక్కువైపోయారు. వాళ్లకి చెయ్యాలని లేదని కాదు..చేసే తీరిక , ఓపిక ఎవ్వరికి ఉండడం లేదు. కాని రీసెంట్ గా  ఓ అమ్మాయి నిరుపేదలకు సాయం చెయ్యాలని  ఓ పెద్ద సాహసం చేసింది అది కూడా 16 యేళ్ల అమ్మాయి. 


లండన్ లో భారతీయ సంతతి కి చెందిన విద్యార్థిని ప్రిషా తాప్రే(16)  తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమెకు చిన్నతనం నుంచి పేదలకు సాయం చేయాలనే ఆలోచన  ఉండేది. కాని ఇప్పుడు పేదలకు సాయం చెయ్యడానికి తనే ఏదైనా చెయ్యాలని ఫిక్స్ అయ్యింది.ప్రపంచంలోనే ప్రత్యేకమైన ఇంగ్లీష్ ఛానల్ అనే  కాలువను ప్రిషా తాప్రే ఈదారు. ఇది నిజంగా రికార్డు క్రియేట్ చేశారు.


 ఆమె ఉత్తర లండన్ లోని బుషే మీడ్స్ స్కూల్ లో చదువుతున్నారు.  ఈ కాలువ ఈదడానికి నాలుగేళ్ల పాటు ట్రైనింగ్ తీసుకొని ...నాలుగేళ్ల అనంతరం గత వారం ఇంగ్లాండులోని డోవర్ తీరం నుంచి ఫ్రాన్స్ లోని క్యాప్ గ్రిస్ నేజ్ వరకు ఈదింది. మొత్తం 34 కిలోమీటర్లను 11 గంటల 48 నిమిషాల్లో తాప్రే ఒంటరిగానే పూర్తి చేసింది. తన గెలుపు ప్రతి అమ్మాయికి , అమ్మలకి ఆడవాళ్లకి డెడికేట్ చేస్తానని చెప్పారు. తాప్రే తల్లిదండ్రులు మహారాష్ట్రకు చెందినవారు.


ఈ కాలువ ఈదడం వల్ల మన ఇండియన్స్ కరెన్సీలో రూ.4 లక్షలు సేకరించారు. ఈ డబ్బును  స్వఛ్ఛంధ సంస్థలకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంటుందని తెలిపారు. తన కష్టార్జితం దానం చెయ్యాలనే కల నిజమైందంటున్నారు ప్రిషా.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news

Related Articles