kalaburgi: పెట్రోల్ పోసి OLA షోరూమ్ తగలబెట్టేసిన యువకుడు.. ఎందుకంటే?

కొన్ని కంపెనీలు మాత్రం సర్వీసింగ్ లు అస్సలు సరిగ్గా ఇవ్వడం లేదట. దీంతో ఒళ్లు మండిన ఓ కస్టమర్ పెట్రోల్ వేసి తగలబెట్టేశాడు.


Published Sep 11, 2024 11:03:33 AM
postImages/2024-09-11/1726070500_Screenshot20240911213124.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: భారత్ లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుంది. ముఖ్యంగా టూ వీలర్స్ ...పెట్రోల్ బాధ లేకుండా ఈవీల మీదే పడుతున్నారు. అయితే ఇప్పటికే ఈవీలు కొనేందుకు కొందురు  చాలా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు మాత్రం సర్వీసింగ్ లు అస్సలు సరిగ్గా ఇవ్వడం లేదట. దీంతో ఒళ్లు మండిన ఓ కస్టమర్ పెట్రోల్ వేసి తగలబెట్టేశాడు. ఎందుకో ఏంటో తెలుసుకుందాం.


 కర్ణాటక రాష్ట్రం కలబర్గికి( గుల్బర్గా)  చెందిన 26 ఏళ్ల నదీమ్ అనే యువకుడి గురించి. అతను వృత్తి పరంగా మెకానిక్ గా చేస్తున్నాడు. నదీమ్ కలబుర్గిలోని ఓలా షోరూమ్ లో ఒక ఎలక్ట్రిక్ బండిని కొనుగోలు చేశాడు. సరిగ్గా నెల క్రితం రూ.1.4 లక్షలు పెట్టి ఓలా ఈవీని కొనుగోలు చేశాడు.  కొన్న నెలకే ఇబ్బందులు రావడం ...అసలు కొన్న డబ్బులకి  సర్వీసింగ్ కూడా సరిగ్గా చేయకపోయే సరికి ఒళ్లు మండి షో రూమ్ ను పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. 


బండి కోసం పదే పదే షో రూమ్ కి తిరిగి తిరిగి చిరాకు వచ్చి ఇలా చేశాడట. అలా ఒకసారి కాదు.. పదే పదే షోరూమ్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడంట. తన బండిని బాగుచేయమని ఎన్నిసార్లు అడిగినా కూడా సిబ్బంది సరిగ్గా రెస్పాండ్ కాలేదు . అందుకే బాటిల్ తో పెట్రోల్ తెచ్చి షో రూమ్ లోని పోసి తగలబెట్టేశాడు.దట్టమైన పొగలు షోరూమ్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఈ ప్రమాదంలో షో రూమ్ లో ఉన్న 6 స్కూటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే లోపల ఉన్న కంప్యూటర్లు కూడా తగలబడిపోయాయి.


ఈ చర్యల వల్ల 8లక్షల 50వేల మేర ఆస్తి నష్టం వచ్చింది. ఓలా వల్ల ఇబ్బంది పడుతున్నవారు మాత్రం నదీమ్ చేసింది కరక్ట్ పనే అని ...సర్వీస్ ఇవ్వలేనపుడు ఎందుకు ప్రాడెక్ట్ అమ్మడం అంటూ ప్రశ్నిస్తున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : electric-scooter viral-video ola-bike petrol

Related Articles