PANDA: క్యూట్ పాండాలు ఎంత వైల్డ్ గా అటాక్ చేస్తాయో తెలుసా ఇదిగో ...ఈ వీడియో !

 చైనాలోని చాంగ్‌కింగ్ జూలో డింగ్ డింగ్ అనే తొమ్మిదేళ్ల పాండా కోపంతో తన జూ కీపర్‌పై దాడి చేసింది. జూ కీపర్ డోర్ క్లోజ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.


Published Sep 25, 2024 01:51:00 PM
postImages/2024-09-25/1727252941_185d64ab02394d04a497fa8b5ff851a8md.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సాధారణంగా జూ లో గమనించండి...పాండాలు ఉన్న ప్లేస్ లో భలే క్యూట్ గా ఉయ్యాలలు..జారుడు బల్లలు ..ఇలా అవి ఆడుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఉంటాయి. అవి కూడా చిన్నపిల్లల్లాగే క్యూట్ గా ఆడుకుంటాయి. అయితే ఎంత క్యూట్ ఉంటాయో ..అంతే వైల్డ్ గా కూడా ఉంటాయి. ఇంత క్యూట్ ఉన్నాయి కాబట్టి అటాక్ చెయ్యలేవనుకుంటారు కాని నో ...చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతాయి కూడా.


 చైనాలోని చాంగ్‌కింగ్ జూలో డింగ్ డింగ్ అనే తొమ్మిదేళ్ల పాండా కోపంతో తన జూ కీపర్‌పై దాడి చేసింది. జూ కీపర్ డోర్ క్లోజ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళా జూ కీపర్ పై పాండా హఠాత్తుగా దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఫుల్ వైరల్ అవుతుంది. ఆడుతూ ఆడుతూనే  పాండా సడన్ గా అటాక్ చేసేసరికి  మహిళా జూ కీపర్ ఎలాగోలా తప్పించుకొని బయటపడింది. 


పాండా దాడితో కిందపడిపోయిన ఆమె..కాళ్లతో తన్నుతూ పాండాను దూరంగా తరిమి ప్రయత్నం చేసింది. కానీ, అది ఆమెపైకి ఎక్కింది.. దాని బరువు, పరిమాణాన్ని భరించిన ఆమెను చివరకు తప్పించుకోగలిగింది. కాని చాలా సడన్ గా జరిగిపోయిందని తృటిలో పెను ప్రమాదం తప్పిందని తెలిపింది. అంతేకాదు మరెన్నో సెఫ్టీ మెజర్స్ క్రియేట్ చెయ్యాలని కూడా క్రియేట్ చేసింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-video

Related Articles