RAINS : నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు, అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం !

జిల్లాల్లోనూ అక్కడక్కడా గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. 


Published Sep 25, 2024 12:02:00 PM
postImages/2024-09-25/1727246023_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందంటున్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్ , నిర్మల్ , నిజామాబాద్ , జగిత్యాల , రాజన్న సిరిసిల్ల మెదక్ , కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ..ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చింది.జిల్లాల్లోనూ అక్కడక్కడా గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. 


ఈనెల 26, 27 తేదీల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27 వరకు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు వెల్లడించింది. 


అత్యధిక స్థాయి వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం చెబుతుంది. అంతేకాదు ..వరంగల్ లో నిన్న 8.95 వర్షపాతం నమోదయ్యింది. నల్గొండ, శాలిగౌరారం మండలంలో 8.35 నాగర్ కర్నూల్ జిల్లా వంగూరులో 7.8 ఇలా అన్ని చోట్ల రికార్డు స్థాయిలో వర్షపాతం రికార్డయ్యింది.


సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కేశంపేట మండలం సంగెంలో పెంకుటిల్లు కూలిపోయింది. కొందుర్గు మండలంలోని ఎంకిర్యాల- తంగళ్లపల్లి మధ్య మట్టి రోడ్డు మళ్లీ తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నవాబుపేట్‌-కొందర్గు మధ్య ఎంకిర్యాల వాగు తెగిపోవడంతో చాలా గ్రామాలు నీట మునిగాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rain-alert

Related Articles