MOHANBABU; సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ ..ఎంత డబ్బు పోయిందంటే ?

కలక్షన్ కింగ్ మోహన్ బాబు ఇళ్లు జల్ పల్లి  లో ఉంది. ఈ ఇంట్లోనే చాలా రోజులుగా పనిచేస్తున్న నాయన్‌ రూ.10 లక్షలతో పారిపోయారు.


Published Sep 25, 2024 11:05:00 AM
postImages/2024-09-25/1727242604_374264mo.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో పనిచేసే పనిమనిషే ఈ పని చేసిందని మోహన్ బాబు రాత్రి రాచకొండ సీపీ కి ఫిర్యాదు చేశారు. కలక్షన్ కింగ్ మోహన్ బాబు ఇళ్లు జల్ పల్లి  లో ఉంది. ఈ ఇంట్లోనే చాలా రోజులుగా పనిచేస్తున్న నాయన్‌ రూ.10 లక్షలతో పారిపోయారు. ఈ విషయంపై మోహన్‌ బాబు మంగళవారం రాత్రి రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణ జరుపగా నాయన్ తిరుపతిలో దొరికినట్లు పోలీసులు తెలిపారు.2019లో ఇదే తరహాలో తన ఫిల్మ్ నగర్‌లోని ఇంట్లో పని చేసే పనిమనిషి డబ్బులు, నగలు దొంగిలిచిందంటూ మోహన్ బాబు కుటుంబం బంజారా హిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది.


అయితే నాయన్ చాలా యేళ్లుగా పనిచేస్తున్నాడనే అందుకే నమ్మి..ఇంట్లో ఉంచితే ఇలా జరిగిందని అన్నారు. అంతేకాదు మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప యమ జోరుగా షూటింగ్ జరుగుతుంది. 100 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నాడు .


హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తార‌లు న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్‌ సింగ్‌ (Mukesh Kumar Singh) దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. ప్రతి సోమవారం అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. అన్నిక్యారక్టర్స్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manchu-family manchu-vishnu mohan-babu kannappa

Related Articles