Devara: దేవర మూవీ ఫస్ట్ రివ్యూ.. అదే పెద్ద మైనస్..?

జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్,శృతి మరాఠా హీరో హీరోయిన్స్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర పార్ట్ వన్ లో శ్రీకాంత్, సైఫ్ అలీఖాన్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దేవర 


Published Sep 25, 2024 02:40:53 AM
postImages/2024-09-25/1727250009_devramoviefirstreview.jpg

న్యూస్ లైన్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్,శృతి మరాఠా హీరో హీరోయిన్స్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర పార్ట్ వన్ లో శ్రీకాంత్, సైఫ్ అలీఖాన్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దేవర మూవీ తో వస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ మన ముందుకు వస్తున్నారు.

దీంతో నందమూరి ఫ్యాన్స్ లో ఒక రకమైన ఎగ్జైటింగ్ కనిపిస్తోంది.అయితే తాజాగా దేవర సినిమా 27కు విడుదల అవ్వగా సినిమాకి సంబంధించి ఓవర్సీస్  డిస్ట్రిబ్యూటర్లు మూవీ చూసి రివ్యూ ఇచ్చేస్తున్నారు.ఈ మూవీని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు చూసి సినిమా హిట్ అనే విధంగా రివ్యూ ఇస్తున్నారు. అయితే ఈ సినిమా చూసిన ఉమైర్ సందు కూడా ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాలు అన్నీ బాగున్నాయి.

కానీ జాన్వీ కపూర్ ఇరిటేటింగ్ గా అనిపించింది. ఇక సైఫ్ అలీఖాన్ యాక్టింగ్ ఫెంటాస్టిక్ గా ఉంది. అలాగే ఈ సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అంటూ 3.5 రేటింగ్ ఇచ్చారు. ఇక ఓవర్సీస్ లో చూసిన డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాకి రివ్యూ ఇచ్చారు. అయితే స్క్రీన్ ప్లే కాస్త రివర్స్ లో ఉండడం కారణంగా ఈ సినిమా చూసే ప్రేక్షకులు కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని,ఇది ఒక్కటి తప్ప ఓవరాల్ గా మూవీ చాలా బాగుందని చెప్పారు.

అలాగే క్లైమాక్స్ అద్భుతంగా ఉందని, బాహుబలి పార్ట్ వన్ రేంజ్ లో దేవర పార్ట్ వన్ క్లైమాక్స్ ఉండబోతుందని హైప్ పెంచేశారు ఈ మూవీ చూసిన డిస్ట్రిబ్యూటర్లు.మరి చూడాలి దేవర సినిమాకి వచ్చిన ఫస్ట్ రివ్యూ లానే సినిమా విడుదలయ్యాక పాజిటివ్ రివ్యూ వస్తుందా అనేది.

https://x.com/UmairSandu/status/1838558782294516041

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr devara janhvi-kapoor umair-sandu koratala-shiva sruti-marata devara-movie-first-review

Related Articles