ఒళ్లంతా మంట..చెత్తకుప్పలో పడేసిన ఆడబిడ్డ రోదన.!

కాలం మారింది టెక్నాలజీ ఎంతో పెరిగింది. ఆడ, మగ సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయినా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఆడపిల్లలపై  అసమానతలు పోవడం లేదు. ఇంకా ఆడపిల్లలు పుడితే చెత్తకుప్పల్లో,  ముళ్ళ పొదల్లో పడేస్తూ వస్తున్నారు. ఇలా చేయడం ఎంతవరకు సమంజసం కాదు. ముక్కు పచ్చలారని పసికూనలను  చెత్త కుప్పల్లో ప్రాణంతో ఉన్న ఆ పాపాయిని పడేస్తే ఎంత తల్లడిల్లుతుంది అంటే ఇక మాటల్లో చెప్పలేం. అలా చెత్తకుప్పలో పడేసిన  పాపాయి రోదన గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం.. అమ్మ నీ కడుపులో 9 నెలలు నన్ను మోసావు.  ఈ సమయంలో నాకు ఎంతో హాయిగా అనిపించింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-01/1719811146_papa.jpg

న్యూస్ లైన్ డెస్క్: కాలం మారింది టెక్నాలజీ ఎంతో పెరిగింది. ఆడ, మగ సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయినా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఆడపిల్లలపై  అసమానతలు పోవడం లేదు. ఇంకా ఆడపిల్లలు పుడితే చెత్తకుప్పల్లో,  ముళ్ళ పొదల్లో పడేస్తూ వస్తున్నారు. ఇలా చేయడం ఎంతవరకు సమంజసం కాదు. ముక్కు పచ్చలారని పసికూనలను  చెత్త కుప్పల్లో ప్రాణంతో ఉన్న ఆ పాపాయిని పడేస్తే ఎంత తల్లడిల్లుతుంది అంటే ఇక మాటల్లో చెప్పలేం. అలా చెత్తకుప్పలో పడేసిన  పాపాయి రోదన గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం.. అమ్మ నీ కడుపులో 9 నెలలు నన్ను మోసావు.  ఈ సమయంలో నాకు ఎంతో హాయిగా అనిపించింది.

నువ్వు కూడా కడుపులో ఉన్నప్పుడు నన్ను అంతే అల్లారు ముద్దుగా చూసుకున్నావు. కారం తింటే కడుపులో బిడ్డకు మండుతుందని, తినడం కూడా మానేశావ్.  అలాంటి నేను పుట్టిన తర్వాత ఆడపిల్ల అని తెలిసి చెత్త కుప్పల్లో ఎలా పడేసావమ్మా.. పుట్టిన తర్వాత నాకు పూల పాన్పు ఉంటుందనుకున్నాను, చెత్తకుండీలోని  గడ్డి, అరటి తొక్కలు, ప్లాస్టిక్ కవర్లు నాకు పాన్పు అయ్యేలా ఎందుకు చేసావ్ అమ్మ.. నాకు ఇక్కడ చీమలు కుడుతుంటే మంట పుడుతోంది, నా శరీరాన్ని కొరుకుతుంటే  ఏడ్చి ఏడ్చి  నా గొంతు కూడా ఆగిపోయేలా ఉంది అమ్మ.. నా కళ్ళల్లో దుమ్ము పడుతుంటే తట్టుకోలేకపోతున్నాను అమ్మ..

నీకు ఏం అన్యాయం చేశాను, నీ కడుపులో నేను ఆడపిల్లగా జన్మించడమే నేను చేసిన పాపమా, అలా చెత్త కుప్పలో పడేయడం నీకు భవ్యమా, నన్ను కన్న నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదమ్మా, కనీసం అది కూడా ఆలోచించకుండా ముళ్ళపొదల్లో విసిరేసి వెళ్లావు. అక్కడ నా శరీరం అంతా ముళ్ళు గుచ్చుతుంటే తట్టుకునే శక్తి కూడా లేదమ్మా, నేను ఆడపిల్లగా పుట్టినందుకు ఆయువు తీసుకోవాల్సిందేనా అమ్మా.. అంటూ ఓ ముక్కుపచ్చలారని పాప రోదిస్తోంది.  ఇలా ఎంతోమంది ఈ సమాజంలో  ఆడపిల్ల అని తెలిసి  రోడ్డున పడేసి పసిబిడ్డల ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పటికైనా అలాంటి పనులు చేయకుండా ఆడపిల్ల అయినా సరే,  మగ పిల్లవాడు అయినా సరే సమానంగా  చూసి సమాజంలో గౌరవంగా బ్రతికేలా చేయాలని కోరుతున్నాను. దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu girls dust-bin crying-baby

Related Articles