Squid Game: స్క్విడ్ గేమ్ -2 వచ్చేస్తుంది ..రిలీజ్ డేట్ ఎప్పుడంటే ..!

దీంతో పాటు సీజన్-2 టీజర్ ను కూడా తాజాగా విడుదల చేశారు. రెండో సీజన్ లో లీ జంగ్ జే, పార్క్ హే సూ, హోయాన్ జంగ్ కీల‌క పాత్రల్లో న‌టించారని తెలిపారు.


Published Sep 19, 2024 05:58:00 PM
postImages/2024-09-19/1726749171_Screenshot20240919180229.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  స్క్విడ్ గేమ్ సీజన్ -2 వచ్చేస్తుంది. ఓటీటీ స్క్విడ్ గేమ్ సీజన్ -1 మెగా హిట్ . ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో సంచలనం సృష్టించింది. నెట్ ఫ్లిక్స్ సగం మంది స్వ్కిడ్ గేమ్ వల్లే రిఛార్జ్ లు చేయించారు. అది హిట్టు రేంజ్. ఇప్పుడు పార్ట్ 2 వచ్చేస్తుంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘ది గేమ్ విల్ నాట్ స్టాప్’ క్యాప్షన్ తో రూపొందించిన ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో పాటు సీజన్-2 టీజర్ ను కూడా తాజాగా విడుదల చేశారు. రెండో సీజన్ లో లీ జంగ్ జే, పార్క్ హే సూ, హోయాన్ జంగ్ కీల‌క పాత్రల్లో న‌టించారని తెలిపారు.


మొదటి సీజన్ తరహాలోనే ఈ సీజన్ లోనూ స్క్విడ్ గేమ్ లో 456 మంది పాల్గొంటారని, ఒక్కో టాస్క్ పూర్తిచేస్తుంటారు. సీజన్‌-2లో మొత్తం 9 ఎపిసోడ్స్‌ ఉన్నాయని, ఈసారి స్క్విడ్ గేమ్ రూల్స్ డిఫ‌రెంట్‌గా ఉంటాయని, ఫస్ట్ సీజన్ కు మించి ట్విస్టులతో సాగుతుందని అంటున్నారు. ఈ సారి జనాలను బెంచ్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. పక్కా గా హిట్టు కొడుతుందంటున్నారు.


ఓ గేమ్ లో ఓడిపోయిన 392 జెర్సీ క్యాండిడేట్ ను గేమ్ నిర్వాహకులు చంపేయడం పోస్టర్ లో కనిపిస్తోంది. కాగా, స్క్విడ్ గేమ్ వెబ్‌సిరీస్‌ సీజన్-2ను డిసెంబ‌ర్ 26 నుంచి వ‌ర‌ల్డ్ వైడ్‌గా స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ సారి నెట్ ఫ్లిక్స్ రేంజ్ మరింత డబుల్ అయిపోతుంది

newsline-whatsapp-channel
Tags : newslinetelugu webseries

Related Articles