TRAIN: వరల్డ్ క్లాస్ వందేభారత్ లో భారీ వర్షం.. తడిసిముద్దయిన ప్రయాణికులు !

మొన్న అయోధ్య( AYODHYA) ఆలయం , నిన్న ఎయిర్ పోర్టు, బీహార్( BIHAR)  లో వంతెనలు , ఇప్పుడు వందేభారత్ ట్రైన్ ఇవన్నీ వర్షానికి బాధితులే. అయితే కారిపోతున్నాయి లేదా కూలిపోతున్నాయి. మొన్న ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 రూఫ్ కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, చాలా మంది గాయాలపాలయ్యారు. 


Published Jun 29, 2024 01:52:00 PM
postImages/2024-06-29/1719649456_keralacongresssharesvideowaterleakvandebharatexpresscover1686913310.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : మొన్న అయోధ్య( AYODHYA) ఆలయం , నిన్న ఎయిర్ పోర్టు, బీహార్( BIHAR)  లో వంతెనలు , ఇప్పుడు వందేభారత్ ట్రైన్ ఇవన్నీ వర్షానికి బాధితులే. అయితే కారిపోతున్నాయి లేదా కూలిపోతున్నాయి. మొన్న ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 రూఫ్ కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, చాలా మంది గాయాలపాలయ్యారు. 


 మొన్న అయోధ్యలో కురిసిన వానకు గర్భగుడిలోకి నీళ్లొచ్చాయి. అంతేనా?.. ఆ తర్వాత కురిసిన వర్షాలకు టెంపుల్ టౌన్ కాస్తా మునిగిపోయింది. మోకాళ్ల లోతు నీటిలో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  బీహార్ లో అయితే చిన్న వర్షాలకు 12 కోట్లు ఖర్చు పెట్టి  కట్టిన బ్రిడ్జ్ పేకమేడలాగా కుప్పకూలిపోయింది.పది, పదకొండు రోజుల వ్యవధిలో ఏకంగా ఐదు వంతెనలు కుప్పకూలాయి.


ఇప్పుడు ఈ లిస్ట్ లో వందేభారత్ ( VANDHE BJARATH) కూడా చేరింది. బయట కురుస్తున్న వర్షం బోగీల్లోకి చేసి ప్రయాణికలను తడిపి ముద్ద చేసేసింది. బోగీ మొత్తం నీరు పారింది. ప్రయాణికులు తడిసి ముద్దయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు( NETIZENS)  కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అంతేకాదు, వర్షానికి ఢిల్లీ ( DELHI AIMS) ఎయిమ్స్‌లోకి నీరు చేరిన వీడియోలను పోస్టు చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు. అంతేనా వెంటనే అధికారులు చర్యలు తీసుకోకపోతే ...మేకిన్ ఇండియా కూడా జోక్ గా మారుతుందని కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : train rains bjp ayodhya

Related Articles