ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. అప్పటి వరకు నవ్వుతూ ఆడుకుంటున్న చిన్నారి చనిపోవడంతో చాలా బాధాకరం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఏ సెలబ్రేషన్స్ కి అయినా బెలూన్స్ ఉండాల్సిందే. అదే పిల్లల బర్త్ డేలు అవి అయితే బెలూన్స్ లేకుండా పని అవ్వదు. బెలూన్ కు గాలిని ఊదుతుండగా చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూడాలి. లేకపోతే చాలా ప్రమాదం. రీసెంట్ గా ఓ ఎనిమిది సంవత్సరాల పాప బెలూన్ ఊదుతుండగా నోట్లో పేలి చనిపోయింది. బెలూన్లోని ఓ ముక్క చిన్నారి గొంతులో ఇరుక్కుపోవడం వల్ల ఊపిరాడక ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. అప్పటి వరకు నవ్వుతూ ఆడుకుంటున్న చిన్నారి చనిపోవడంతో చాలా బాధాకరం.
ధూలే నగరంలోని యశ్వంత్ నగర్లోని సక్రి రోడ్ సమీపంలో డింపుల్ మనోహర్ వాంఖడే అనే బాలిక ఈ ఘటనలో ప్రాణాలు విడిచింది. అయితే సెలవులు కావడంతో పిల్లలంతా బెలూన్స్ తో ఆడుకుంటున్నారు. సడన్ గా బెలూన్ పేలడంతో ఎక్కువ మొత్తంలో గాలి ఒకేసారి మిగడంతో పాటు బెలూన్ రబ్బర్ ను మింగేసింది. ఇది గొంతుకు అడ్డుపడడంతో ఊపిరి ఆడక చనిపోయింది.