చాణక్యపురి ఏరియాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో అతిథులకు ఉచితంగా సర్వ్ చేసే బ్రేక్ ఫాస్ట్ తినేసి అక్కడి నుంచి బిల్ కట్టకుండా జంప్ అయిపోదామని అనుకుంది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఫైవ్ స్టార్ హోటల్ వాళ్లను ప్రాంక్ చెయ్యాలనుకుంది ఓ యూట్యూబర్ . కాని తనే అందరి ముందు జోకర్ అయ్యింది . ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. ఫ్రీ గా టిఫిన్ చేద్దామని వెళ్లి రూ. 3,600 బిల్లు చెల్లించి బయటపడింది. అసలు ఏం జరిగిందంటే..
చాణక్యపురి ఏరియాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో అతిథులకు ఉచితంగా సర్వ్ చేసే బ్రేక్ ఫాస్ట్ తినేసి అక్కడి నుంచి బిల్ కట్టకుండా జంప్ అయిపోదామని అనుకుంది. ప్రాంక్ కాస్త బెడిసి కొట్టింది. సాధారణంగా హోటల్ లో దిగిన అతిథులు నైట్ డ్రెస్ తోనే బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వస్తారు. అదేవిధంగా నిషు తివారీ కూడా నైట్ డ్రెస్ తో హోటల్ లోపలికి వెళ్లింది. ఇక్కడ వరకు తన ప్లాన్ ప్రకారమే జరిగింది కాని ...తినేసి వస్తుండగా దొరికిపోయింది.
లోపల బఫే సిస్టం కావడంతో నచ్చిన ఫుడ్ తీసుకుని కడుపునిండా తిన్నాక నిషు మెల్లగా జారుకునే ప్రయత్నం చేసింది. అయితే, ద్వారం వద్ద ఉన్న సిబ్బంది నిషును ఆపి ఆమె చెప్పిన గదిలో వేరే అతిథి ఉన్నారని, కరెక్ట్ రూమ్ నెంబర్ చెప్పాలని అడిగారు. దీంతో దొరికిపోయానని తెలుసుకొని తిన్న దానికి బిల్ పే చేస్తానని చెప్పడంతో రూ.3,600 బిల్లు చెల్లించింది. బయటకు వచ్చాక ఇది అత్యంత ఖరీదైన బ్రేక్ ఫాస్ట్ అని చెబుతూ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త ఫుల్ వైరల్ అయ్యింది.