viral: తాగుబోతులకు బుద్ది చెప్పిన ఆడలేడీస్ ..చితక్కొట్టేశారుగా

ముంబైలో జరిగింది.వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.


Published Aug 26, 2024 04:39:47 AM
postImages/2024-08-26/1724665080_87867817.cms

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : మందుబాబుల ఆగడాలు హద్దు అదుపు లేకుండా పోతుంది. సాయంత్రం అయితే చాలు..సంపాదించిందంతా..మందుకే తగలబెడతారు. రోడ్లపైనే పార్టీలు..రోడ్లపైనే విందులు...సైలెంట్ గా వెళ్లే వారిని కూడా గొడవలకు దింపుతూ ..ఆడపిల్లల్ని ఏడిపిస్తూ తెగ హంగామా చేస్తున్నారు. అందుకే గట్టిగా బుద్దిచెప్పారు ఆడవాళ్లు. ఇక ఇదంతా భరించలేని ఆడవారు ..అక్కడున్న తాగుబోతులకు గట్టిగా బుద్ది చెప్పారు. ఈ ఘటన ముంబైలో జరిగింది.వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.


ముంబయిలోని ఓ ఏరియాలో స్థానిక మహిళలు రోడ్డెక్కారు. నడిరోడ్డుపై మందేస్తున్న తాగుబోతులను చీపుర్లు తిరగేసి చితక్కొట్టారు. తాగి ఇబ్బందిపెడుతున్న వారందరిని ఆడ వారంతా కలిసి చితక్కొట్టేశారు. ఒకరికొకరు తోడుగా మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడు అది వైరల్‌గా మారింది. 


ఈ సంఘటన ముంబైలోని కండివాలిలోని లాల్జీ పడాలో జరిగినట్టుగా తెలిసింది. రోడ్లపైనే మందేస్తూ మహిళలు, చిన్నారులు, వృద్ధులను రోడ్లపై అడ్డగిస్తూ ..బూతులు మాట్లాడుతూ ఇబ్బందిపెడుతున్నవారిని బడితే పూజ చేశారు. వీడియోలో, చేతిలో చీపుర్లు పట్టుకుని చితక్కొట్టారు. అక్కడి వారు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెటిజన్లు ఈ పనిని సమర్ధిస్తున్నారు కూడా. ఎంతకని చూస్తారు..ఎవరో ఒకరు బుద్ది చెప్పాల్సిందేనంటున్నారు నెటజన్లు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news mumbai alchohal

Related Articles