ap: ఏపీలో డయేరియా కేసులు ....హాస్పటిల్ లో వందల సంఖ్యలో పేషెంట్లు 2024-06-27 19:55:57

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏపీలో ( ap) డయారియా( diarrhea)  కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులు కారణంగా పెద్ద ఎత్తున జనాలు ఆస్పత్రి పాలయ్యారు. గత నాలుగు రోజుల్లో వందమందికి పైగా డయేరియా బారినపడ్డారు. బాధిత ప్రాంతాల్లో అధికారులు యుద్దప్రాతిపదికన రక్షిత తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టారు.

గుంటూరు( guntur) , ఎన్టీఆర్ ( ntr) జిల్లాలలో వాంతులు ( vomtings) విరోచనాలతో జనాలు చికిత్స పొందుతున్నారు.
జగ్గయ్యపేట( jaggayapeta)  రూరల్‌లో పరిస్థితి కొంత కంట్రోల్‌లోకి వచ్చినా.. పట్టణంలో కేసులు పెరుగుతున్నాయి. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో( government hospital)  బాధితులకు చికిత్స అందించారు. ట్రీట్మెంట్ తర్వాత కొందరు డిశ్చార్జ్ కాగా.. మరికొందరు డయేరియాతో ఆస్పత్రిలో చేరారు. ఏపీ వైద్య శాఖమంత్రి ( health minister) సత్యకుమార్ రాకతో అలర్టైన అధికారులు.. డయేరియా ప్రబలుతున్న ప్రాంతాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.


ఇలాంటి టైంలో చికెన్, మటన్ తినడం జిల్లావాసులకు మంచిది కాదని తెలిపడంతో ...చికెన్ మటన్ అమ్మకాల్లో జోరు తగ్గింది. జిల్లాలో పరిస్థితి అదుపులోకి రావడానికి దాదాపు మరో వారం పడుతుంది. వర్షాల కారణంగా అంటువ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది ఆరోగ్యశాఖ.