T20 Worldcup: రాణించిన విరాట్, అక్షర్.. సఫారీ ముందు భారీ లక్ష్యం.! 2024-06-29 22:00:28

 

న్యూస్ లైన్ స్పోర్ట్స్: టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా భారీ స్కోర్ ను నమోదు చేసింది. భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ(76), అక్షర్ పటేల్(47), శివం దూబే(27) రాణించారు. దాంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. ఇక సఫారీ బౌలర్లు కేశవ్ మహారాజ్, అన్రిక్ నోకియా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా బౌలర్లు భారత బ్యాటర్లను తక్కువ స్కోర్ కి కట్టడి చేశారు. ఫైనల్ పోరులో టీమిండియా, సఫారీ జట్టు ముందు 177 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(9), రిషబ్ పంత్()ను కేశవ మహారాజ్ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత కాగిసో రబడా బౌలింగ్ లో సూర్య కుమార్ యాదవ్(3) బౌండరీ వద్ద హేన్రిక్ క్లాసన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. ఇక తర్వాత క్రీజులో దిగిన అక్సర్ పటేల్ మంచి బ్యాటింగ్ చేశాడు. అక్సర్, విరాట్ ఇద్దరు కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ జోడి సౌతాఫ్రికా బౌలర్లకు ఊచకోత చూపిస్తూ బౌండరీలు, సిక్సర్లు బాదరు. భారత్ స్కోర్ బోర్డుకు 100 పరుగులు జతచేశారు. అయితే రబడా ఓవర్ లో అక్సర్ రనౌట్ అయ్యాడు. తర్వాత కింగ్ కోహ్లీ నిలకడగా ఆడుతూ ( 58 బంతుల్లో 76 పరుగులు 6 ఫోర్లు, 2 సిక్సర్ల )తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్యాటింగ్ కు శివం దూబే దిగాడు. విరాట్ కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ ఇద్దరు స్కోర్ బోర్డుకు 40 రన్స్ జోడించారు. అయితే విరాట్(76), మారకో జనసేన బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి రబడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఇక ఆఖరిలో దూబే(27), హార్దిక్ పాండ్యా(5) సూపర్ క్యామియో ఇన్నింగ్స్ ఆడారు. దాంతో టీమిండియా టీ20 ప్రపంచకప్ లో భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కేశవ్ మహారాజ్, అన్రిక్ నోకియా రెండు వికెట్లు పడగొట్టాగా.. కాగిసో రబడా, మారకో జనసేన చెరో వికెట్ తీశారు.