టీ20 ప్రంపచకప్ ఫైనల్ పోరులో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ ఫైనల్‌లో పోరులో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించి.. టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచింది. భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అక్షర్ పటేల్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో టీమిండియా, సఫారీ జట్టుపై 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఫైనల్ లో భారత్ గ్రాండ్ విక్టరీ..!
సౌతాఫ్రికా పై టీమిండియా ఘన విజయం
హాఫ్ సెంచరీతో చెలరేగిన కోహ్లీ
అక్షర్ పటేల్ తుఫాన్ ఇన్నింగ్స్
హార్దిక్, బుమ్రా, అర్షదీప్ బౌలింగ్ షో
న్యూస్ లైన్ స్పోర్ట్స్: టీ20 ప్రంపచకప్ ఫైనల్ పోరులో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ ఫైనల్‌లో పోరులో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించి.. టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచింది. భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అక్షర్ పటేల్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో టీమిండియా, సఫారీ జట్టుపై 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(9), రిషబ్ పంత్(0)ను కేశవ మహారాజ్ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత కాగిసో రబడా బౌలింగ్ లో సూర్య కుమార్ యాదవ్(3) బౌండరీ వద్ద హేన్రిక్ క్లాసన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. ఇక తర్వాత క్రీజులో దిగిన అక్సర్ పటేల్ మంచి బ్యాటింగ్ చేశాడు. అక్సర్, విరాట్ ఇద్దరు కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ జోడి సౌతాఫ్రికా బౌలర్లకు ఊచకోత చూపిస్తూ బౌండరీలు, సిక్సర్లు బాదరు. భారత్ స్కోర్ బోర్డుకు 100 పరుగులు జతచేశారు. అయితే రబడా ఓవర్ లో అక్సర్ రనౌట్ అయ్యాడు. తర్వాత కింగ్ కోహ్లీ నిలకడగా ఆడుతూ ( 58 బంతుల్లో 76 పరుగులు 6 ఫోర్లు, 2 సిక్సర్ల )తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్యాటింగ్ కు శివం దూబే దిగాడు. విరాట్ కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ ఇద్దరు స్కోర్ బోర్డుకు 40 రన్స్ జోడించారు. అయితే విరాట్(76), మారకో జనసేన బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి రబడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఇక ఆఖరిలో దూబే(27), హార్దిక్ పాండ్యా(5) సూపర్ క్యామియో ఇన్నింగ్స్ ఆడారు. దాంతో టీమిండియా టీ20 ప్రపంచకప్ లో భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కేశవ్ మహారాజ్, అన్రిక్ నోకియా రెండు వికెట్లు పడగొట్టాగా.. కాగిసో రబడా, మారకో జనసేన చెరో వికెట్ తీశారు.
భారీ లక్ష్యాన్ని ను ఛేదించేందుకు బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టుకు ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్(2)ను జాస్ప్రిత్ బుమ్రా క్లీన్ బోల్డ్ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ ఐడెన్ మార్కురామ్(4), అర్షదీప్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. దీంతో దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 30 రన్స్ కొట్టింది. తర్వాత బ్యాటింగ్ కు త్రిస్థాన్ స్టబ్స్ దిగాడు. క్వింటన్ డికాక్ తో కలిసి దూకుడు బ్యాటింగ్ చేశాడు. ఈ జోడి స్కోర్ బోర్డుకు 60 రన్స్ జతచేశారు. అయితే స్టబ్స్(31)ను అక్షర్ పటేల్ వెనక్కి పంపాడు. తర్వాత క్రీజులో దిగిన హేన్రిక్ క్లాసన్ తుఫాన్ బ్యాటింగ్ చేశాడు. మరో ఎండ్ లో డికాక్ హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్ చేస్తూ బౌండరీలు, సిక్సర్లు బాదడు. వీళ్ళిద్దరూ స్కోర్ బోర్డుకు 50 పరుగులు జోడించారు. అయితే డికాక్(33), హర్షద్ బాలింగ్ లో బౌండరీ వద్ద కుల్దీప్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక క్లాసన్ బౌండరీలు స్కోర్ చేస్తూ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కానీ హార్దిక్ పాండ్యా ఓవర్ లో క్లాసన్(53) ఔటయ్యాడు. చివరిలో డేవిడ్ మిల్లర్(21) ఒంటరి పోరాటం చేశాడు. కానీ ఫలితం దక్కలేదు. దాంతో భారత్, సౌతాఫ్రికా జట్టుపై 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్లు హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టాగా.. బుమ్రా, అర్షదీప్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విక్టరీతో ఇండియా ఐసీసీ మేన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచింది.