పాన్ ఇండియా మూవీలో ఆఫర్ కొట్టేసిన శివాజీ..పాత్ర చాలా పవర్ఫులట.! 2024-06-29 20:27:08

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో  కామెడీ హీరోగా  ఎంతో గుర్తింపు పొందారు శివాజీ(shivaji)  అలా  కొన్నాళ్లపాటు మంచి ఆదరణతో దూసుకెళ్లిన శివాజీ, ఆ తర్వాత ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చారు.  అలాంటి ఈ హీరో బిగ్ బాస్ సీజన్ 7లో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందారు. ఈయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రిలీజైనటువంటి వెబ్ సిరీస్ ఎంతో ఆదరణ పొందింది. వెబ్ సిరీస్ తర్వాత ఆయనకు వరుస ఆఫర్లు వస్తున్నాయట.  

అలాంటి శివాజీ ఒక పాన్ ఇండియా చిత్రంలో కూడా కీలకపాత్రలో చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే  'కుర్మనాయకి'(kurmanayaku). సోషియో ఫాంటసీ కథతో తెరకేక్కుతున్న ఈ మూవీని కాలభైరవ, రోషన్  ప్రొడక్షన్స్  బ్యానర్ పై తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. అలాంటి ఈ మూవిని హర్షవర్ధన్ కడియాల డైరెక్షన్ చేస్తున్నారు. అలాగే నిర్మాతలుగా  పూజా సహా,  స్నిగ్ధ మణికాంత్ రెడ్డి  ఉన్నారు. అలాంటి ఈ చిత్రంలో  సాయికుమార్, వరలక్ష్మి శరత్ కుమార్, గణేష్, వంటి కీలక నటులు నటిస్తున్నారని తెలుస్తోంది.

ఇక ఇందులో శివాజీ పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని  సమాచారం. శివాజీ బర్త్డే సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ  ప్రాజెక్టులోకి వెల్కమ్ చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది "కుర్మ నాయక్" చిత్ర యూనిట్. మహావిష్ణు అవతారాల్లో కుర్మావతారం ఒకటి. అందుకే ఈ చిత్రానికి కురుమనాయకి అని పేరు పెట్టారు. ఇప్పటికే కొంతవరకు  షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థర్డ్ షెడ్యూల్ లో శివాజీ జాయిన్ అయ్యారట. ఈ చిత్రంలో శివాజీ పాత్ర చాలా పవర్ఫుల్ అని పిలుస్తోంది.