'పుష్ప' అనుకుంటిరా..కాదు  అల్లరి నరేష్..!  2024-06-29 20:46:56

న్యూస్ లైన్ డెస్క్: పుష్ప పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది  అల్లు అర్జున్ (allu arjun)క్యారెక్టర్. ఈ చిత్రంలో ఆయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా  ఉంటుంది. ఇక ఇండస్ట్రీలో ఆ క్యారెక్టర్ లో అంతలా ఒదిగిపోయే హీరో ఎవరు కూడా ఉండరు అనుకోండి. అందులో నటించడం కాదు అల్లు అర్జున్ జీవించేసాడు. తగ్గేదేలే అనే డైలాగుతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాంటి అల్లు అర్జున్ పుష్ప(pushpa) సినిమా రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడంతో దానికి సీక్వెల్ గా పుష్ప2 సినిమా కూడా రాబోతోంది.

ఇప్పటికే ఆ చిత్రం  షూటింగ్ కూడా పూర్తయ్యే దశకు వచ్చింది. అలాంటి పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ గెటప్ చాలా డిఫరెంట్. అయితే అలాంటి గెటప్ లోనే  అల్లరి నరేష్(alllari naresh)కూడా కనిపిస్తున్నారు. అయితే అల్లరి నరేష్ త్వరలో "బచ్చల మల్లి" (bachalamalli)అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. సుబ్బ మంగాదేవి డైరెక్షన్ లో హాస్య మూవీస్ బ్యానర్ పై  బాలాజీ గుప్తా, రాజేష్ దండ నిర్మాణ సారథ్యంలో ఈ మూవీ వస్తోంది.  అయితే ఈ  చిత్రంలో అమృత అయ్యారు కథానాయకగా చేస్తుందట. షూటింగ్ దశలో ఉన్నటువంటి బచ్చల మళ్ళీ మూవీ  నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది.

https://x.com/HasyaMovies/status/1806910384089244046

అయితే ఈ పోస్టర్ ను అలా చూడగానే చాలామంది పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ అనుకుంటారు. కానీ కాస్త కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తే అందులో కనిపించేది అల్లరి నరేష్. అయితే అల్లరి నరేష్ పుట్టినరోజు జూన్ 30 సందర్భంగా  ఒకరోజు ముందుగానే ఈ చిత్ర పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే పుట్టినరోజు నాడు  గ్లింప్స్ కూడా  రిలీజ్ చేస్తారట. అయితే ఈ సినిమా కోసం అల్లరి నరేష్ చాలా కష్టపడుతున్నారని పవర్ఫుల్ పాత్రలో చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ పోస్టర్ ను చూసి చాలామంది చూడగానే పుష్ప అనుకుంటివా కాదు అల్లరి నరేష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.