Neem: వేపాకును చీప్ గా చూస్తున్నారా..  ప్రయోజనాలు తెలిస్తే షాకే.?

సాధారణంగా వేప చెట్టు అనేది  ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ వేప చెట్టును  ఎన్నో ఔషధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు.  అలాంటి వేప పుల్లతో ప్రతిరోజు పళ్ళు తోముకుంటే పళ్ళు బలంగా ఉండడమే కాకుండా శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది.వేపాకును ప్రతిరోజు పరిగడుపున ఒకటి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయట. అవేంటో చూద్దాం.. ప్రతిరోజు ఉదయాన్నే 10 వేపాకులను పరిగడుపున తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ తగ్గి , మధుమేహం నియంత్రణలోకి వస్తుందట. అలాగే జీర్ణ సమస్యలున్నవారు ప్రతిరోజు వేపాకు పరిగడుపున తినడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందట. ఇక ముఖ్యంగా గ్యాస్ ఎసిడిటీ అనేవి దరిదాపుల్లో కూడా ఉండవట. దంతాలు, నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు తగ్గిపోతాయట. నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియా నశించి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.


Published Jun 30, 2024 12:45:01 PM
postImages/2024-06-30//1719731701_vepaki.jpg

న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా వేప చెట్టు అనేది  ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ వేప చెట్టును  ఎన్నో ఔషధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు.  అలాంటి వేప పుల్లతో ప్రతిరోజు పళ్ళు తోముకుంటే పళ్ళు బలంగా ఉండడమే కాకుండా శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. అలాంటి వేపాకును ప్రతిరోజు పరిగడుపున ఒకటి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయట. అవేంటో చూద్దాం.. ప్రతిరోజు ఉదయాన్నే 10 వేపాకులను పరిగడుపున తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ తగ్గి , మధుమేహం నియంత్రణలోకి వస్తుందట.

అలాగే జీర్ణ సమస్యలున్నవారు ప్రతిరోజు వేపాకు పరిగడుపున తినడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందట. ఇక ముఖ్యంగా గ్యాస్ ఎసిడిటీ అనేవి దరిదాపుల్లో కూడా ఉండవట. వేపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.  ప్రేగుల్లో ఉండే సూక్ష్మక్రిములు నశించి ఆరోగ్యంగా ఉంటారట. ముఖ్యంగా చర్మ సమస్యలు ఉన్నవారు వేపాకులు తినడం వల్ల ఉపశమనం లభిస్తుందట. చర్మంపై ఏర్పడే దద్దుర్లు,మచ్చలు ఈజీగా తగ్గిపోతాయట.

వేపాకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో  ఉండేటువంటి సూక్ష్మ క్రీములను  నశింపజేసి అన్ని రకాలుగా శరీరానికి మేలు చేస్తుందట. అలాగే దంతాలు, నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు తగ్గిపోతాయట. నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియా నశించి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health health-benifits neem-leaves digestive-system

Related Articles