Actress Hema: తిరుమలలో నటి హేమ.. ఎలా అక్కా...అసలు ఏం జరగనట్లు అలా ! 2024-06-29 20:42:53

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ :  బెంగుళూరు( banglore)  రేవ్ పార్టీ ( rave party) అసలు ఏ రేంజ్ గొడవయ్యింది. అసలు హేమ( hema)  అక్క ని అయితే ...ఆల్ మోస్ట్ పట్టేసుకున్నారు. తర్వాత కేసు చల్లబడిపోయింది అది వేరే విషయం . డ్రగ్స్ ( drugs case) కేసులో హేమక్క అరెస్టై జైలుకు కూడా వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె.. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.


అసలు ఏం జరగనట్లు ...తనకు ఆ విషయమే తెలియనట్లు నవ్వుతూ మీడియా వాళ్లకు కనిపించారు.  అక్కడ జనం ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. మీడియాతో మాట్లాడుతూ దర్శనం బాగా జరిగిందని.. చిన్నప్పటి నుంచి ఈ ఆలయానికి వస్తున్నానని చెప్పింది. అయితే.. డ్రగ్స్ కేసు గురించి ప్రశ్నించిన రిపోర్టర్లకు సెటైర్లు వేసింది. 'మీకే తెలియాలి.. మీరే ఏదేదో వేస్తున్నారుగా న్యూస్.. నాకేంటే మీకే బాగా తెలుసు' అంటూ అక్కడి నుంచి బయల్దేరింది. 
నెటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో  ఆడుకుంటున్నారు..అసలు ఏం జరగనట్లు ఎలా అక్కా...అంటూ తెగ కమెంట్లు చేస్తున్నారు.